Atchannaidu : ఏపీ సర్కార్ పై అచ్చెన్న కన్నెర్ర
ప్రభుత్వానికి సిగ్గు అనేది ఉందా
Atchannaidu : ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ చీఫ్ కింజారపు అచ్చెన్నాయుడు(Atchannaidu) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం ఆరోపణలు చేశారు. ఇందులో నారా లోకేష్ బాబు ప్రమేయం ఉందంటూ బహిరంగంగా ప్రకటించారు.
Atchannaidu Slams AP Govt
ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు నారా లోకేష్. ఈ సందర్బంగా జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది ఆయనకు సంబంధం లేదంటూ చెప్పారు. మరి ఎవరు తప్పు చేస్తున్నారనేది ప్రజలు ఆలోచించాలని అన్నారు అచ్చెన్నాయుడు.
కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే తమ పార్టీ చీఫ్ ను అనవసరంగా జైలు పాలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తనను కూడా ఇరికించే ప్రయత్నం చేశారని, తాము ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు కింజారపు అచ్చెన్నాయుడు.
అసలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసేందుకు ఏపీ సర్కార్ కు సిగ్గంటూ ఉండాలి కదా అని ప్రశ్నించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, భయ భ్రాంతులకు గురి చేసినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడా భయాందోళనకు గురి కారంటూ పేర్కొన్నారు. తాము న్యాయం దక్కేంత వరకు పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు అచ్చెన్నాయుడు.
Also Read : PM Modi Praise : చరిత్రాత్మక విజయం మోదీ సంతోషం