CM KCR Message : స్వప్నం సాకారం రాష్ట్రం పురోగమనం
స్పష్టం చేసిన సీఎం కేసీఆర్
CM KCR Message : హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి బాస్ , సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ సీఎం సందేశాన్ని ప్రజలకు అందించింది. ఈ సందర్బంగా 10 ఏళ్ల కాలంలో ఎలా ప్రభుత్వం ప్రజల కోసం పని చేసిందనే దానిపై స్పష్టం చేసింది.
CM KCR Message Viral
రాష్ట్రం ప్రగతి ప్రస్థానంలో సబ్బండ వర్గాలకు సముచిత స్థానం ఇవ్వడం జరిగిందని పేర్కొంది. దార్శనిక సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో ఏ ఒక్క వర్గాన్ని విస్మరించ లేదని తెలిపింది. అభివృద్ది ఫలాలను అందరికీ పంచేందుకు కృషి చేశారని పేర్కొంది బీఆర్ఎస్ పార్టీ.
సమానత్వం, స్మిళిత తత్వం, ఆత్మ గౌరవ జీవనం అనే ప్రాథమిక విలువలే పునాదిగా తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతోందని స్పష్టం చేసింది. ఇదే మన తెలంగాణ పేరుతో ఇవాళ సందేశం ఇచ్చారు సీఎం కేసీఆర్.
అందరి శ్రమతో అందరి పురోగతి అనే సిద్దాంతాన్ని ఆచరణలో చూపిస్తున్నామని తెలిపారు. ప్రజలంతా కలిసి మెలిసి మరింత మెరుగైన, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అందు వల్లనే ప్రజలు కోరుకున్న స్వప్నం సాకారమైందని , రాష్ట్రం పురోభివృద్ది దిశగా పయనిస్తోందని స్పష్టం చేసింది బీఆర్ఎస్ పార్టీ.
Also Read : Dasoju Sravan : పిల్లల ఆకలి తీరిస్తే తప్పా