Minister KTR : గులాబీదే విజ‌యం కేసీఆరే సీఎం

ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్

Minister KTR : హైద‌రాబాద్ – ఐటీ, పుర‌పాలిక శాఖ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పులి సింగిల్ గా ఎంట్రీ ఇస్తుంద‌న్నారు. తెలంగాణ‌లో ఇక ఎన్నిక‌లు ఏక‌ప‌క్ష‌మేన‌ని ఇందులో ఎలాంటి సందేహం లేద‌న్నారు. గులాబీ ముచ్చ‌ట‌గా మూడోసారి గ్రాండ్ విక్ట‌రీ సాధించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు కేటీఆర్(Minister KTR). తిరిగి సీఎంగా కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారం చేస్తార‌ని , డిసెంబ‌ర్ 9న తెలంగాణ గ‌డ్డ‌పై గులాబీ జెండా రెప రెప లాడుతుంద‌ని దీనిని అడ్డుకునే శ‌క్తి రాష్ట్రంలో ఏ నాయ‌కుడికి, ఏ పార్టీకి లేద‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్.

Minister KTR Comment

దేశంలో ఎక్క‌డా లేని రీతిలో త‌మ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసింద‌న్నారు. ఇవాళ ప్ర‌పంచంలోని దిగ్గ‌జ కంపెనీల‌న్నీ హైద‌రాబాద్ వైపు చూస్తున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు ఐటీ శాఖ మంత్రి. ద‌క్షిణ భార‌త దేశంలోనే స‌రికొత్త అధ్యాయం సృష్టించ‌డం ఖాయ‌మ‌న్నారు.

ద‌క్ష‌త క‌లిగిన నాయ‌క‌త్వానికి అరుదైన గౌర‌వం ద‌క్కుతుంద‌న్నారు. విశ్వ‌స‌నీయ‌తే త‌మ విజ‌య మంత్ర‌మ‌ని పేర్కొన్నారు. జ‌నం నీరాజ‌నం ప‌లికేందుకు రెడీగా ఉన్నార‌ని పేర్కొన్నారు కేటీఆర్. త‌మ సార‌థి ఎల్ల‌ప్ప‌టికీ కేసీఆరేన‌ని స్ప‌ష్టం చేశారు.

అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు మేలు చేకూర్చేలా చ‌ర్య‌లు తీసుకున్న ఘ‌న‌త ఒక్క సీఎం కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు. తాము ఎన్నిక‌ల గురించి ఆలోచించ‌డం లేద‌ని, కేవ‌లం నంబ‌ర్ల మీదే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టామ‌ని పేర్కొన్నారు.

Also Read : Congress CPI CPM : కాంగ్రెస్ దోస్తానా లెఫ్ట్ కు న‌జ‌రానా

Leave A Reply

Your Email Id will not be published!