Rahul Gandhi Posters : రాహుల్ గాంధీ పోస్ట‌ర్ల క‌ల‌క‌లం

ములుగు టూర్ లో వైర‌ల్

Rahul Gandhi Posters : ములుగు జిల్లా – ఓ వైపు తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇప్ప‌టికే తుక్కుగూడ వేదిక‌గా ఆరు గ్యారెంటీల పేరుతో మేని ఫెస్టోను ప్ర‌క‌టించింది. ఇక డైన‌మిక్ లీడ‌ర్ రేవంత్ రెడ్డి సార‌థ్యంలో టీపీసీసీ కొత్త పుంత‌లు తొక్కుతోంది. 119 సీట్ల‌కు గాను తొలి విడ‌త‌గా 55 సీట్ల‌ను ఖ‌రారు చేసింది. మ‌రో వైపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ టూర్ సంద‌ర్భంగా ములుగు జిల్లాలో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా పోస్ట‌ర్లు వెలిశాయి. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్స్ హాట్ టాపిక్ గా మారాయి.

Rahul Gandhi Posters Viral

ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను నిర‌సిస్తూ ములుగు నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా పోస్ట‌ర్లు వెలిశాయి. ఇదిలా ఉండ‌గా ములుగుకు సీత‌క్క ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆమె శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నారు. క‌రోనా క‌ష్ట కాలంలో ప్రాణాల‌కు సైతం తెగించి సేవ‌లు అందించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్దికి నిధులు ఇవ్వాలంటూ ఆమె ఆందోళ‌న‌లు చేప‌ట్టారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ స‌ర్కార్ ను నిల‌దీశారు.

తీరా ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో తొలి లిస్టులోనే ములుగు సీటు ద‌క్కించుకుంది సీత‌క్క‌.
కాగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) గిరిజ‌న యూనివ‌ర్శిటీ గురించి పార్ల‌మెంట్ లో ఏనాడూ మాట్లాడ లేద‌ని, రామ‌ప్ప ఆల‌య అభివృద్ది కోసం నిధులు ఎక్క‌డివంటూ ప్ర‌శ్నించారు ఈ పోస్ట‌ర్ల‌లో. వ‌న దేవ‌త‌లైన స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ ల జాత‌ర‌కు జాతీయ హోదా గురించి ప్ర‌స్తావించిన పాపాన పోలేదంటూ పేర్కొన్నారు. ఓట్ల కోసం ప‌రుగెత్తుకు వ‌చ్చాడంటూ రాహుల్ గాంధీ పోస్ట‌ర్లు వేశారు.

Also Read : Buggana Rajendranath Reddy : ప్ర‌జా సంక్షేమం ప్ర‌భుత్వ ధ్యేయం

Leave A Reply

Your Email Id will not be published!