Indian Fans Prayers Comment : దేవుడా రక్షించు దేశాన్ని గెలిపించు
దేశమంతటా ప్రార్థనల వెల్లువ
Indian Fans Prayers: ఈ దేశాన్ని కుల, మతాలు శాసిస్తున్నాయని అనుకుంటే పొరపాటు పడినట్లే. 140 కోట్ల భారతీయులను కలుపుతున్న ఏకైక ఆట క్రికెట్. ఒకప్పుడు గిల్లీ దండా అనే వాళ్లు. దానితోనే గల్లీల్లో ఆడే వారు. కానీ సీన్ మారింది. టెక్నాలజీ తోడైంది. దానికి మరింత హంగులు, ఆర్భాటాలు వచ్చి చేరాయి. అంతకు మించి రాజకీయాలతో పాటు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ల , బడా బాబుల కన్ను పడింది. ఇంకేం సినీ తారల తళుకు బెళుకులు కూడా ఏవీ పని చేయడం లేదు. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ సైతం గుజరాత్ బాట పట్టారు. ప్రముఖులు, దిగ్గజాలు అహ్మదాబాద్ జపం చేస్తున్నారు. దీనికి కారణం ఒకే ఒక్క మ్యాచ్. తాడో పేడో తేల్చుకునేందుకు భారత క్రికెట్ జట్టు రెఢీ అయ్యింది.
Indian Fans Prayers for World Cup Win Viral
12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) వన్డే వరల్డ్ కప్ 2023కు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యధిక వ్యూయర్ షిప్ సాధించిన ఏకైక టోర్నీగా ఇది నిలిచింది. ముంబై వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ ను ఏకంగా 6 కోట్ల మందికి పైగా వీక్షించినట్లు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇది ఓ రికార్డ్. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఓ అరుదైన రికార్డ్ గా పేర్కొంది. ఇది పక్కన పెడితే ..ఇండియన్ హిస్టరీలో ఒక క్రీడా టోర్నీలో దేశంలో అత్యున్నతంగా భావించి, గౌరవించే ఇండియన్ వైమానిక దళం (ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ) ప్రత్యేకంగా అహ్మదాబాద్ లోని మోతేరా స్టేడియంలో ప్రద్శర్శనలు ఇవ్వబోతోంది. ఇది కూడా విస్తు పోయేలా చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రచురణ, ప్రసార, డిజిటల్ మీడియా సంస్థలన్నీ భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ పోరు గురించి ఎప్పటికప్పుడు వార్తలను, విశేషాలను అందజేసేందుకు రెడీ అయ్యాయింటే దీనికి ఎంత పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక దేశమంతటా క్రికెట్ అభిమానులు వేలాది మంది తమ తమ ప్రార్థనా మందిరాల వద్ద కూర్చుకున్నారు. మేరా భారత్ మహాన్ అంటూ , జాతీయ పతాకాలను చేత పట్టుకుని , ప్రపంచ కప్(World Cup) గెలవాలని కోరుకుంటున్నారు. తమ ఇష్ట దైవాలను ఎలాగైనా సరే గెలిపించాలని వేడుకుంటున్నారు. చిన్నారులు, పెద్దలు, మహిళలు ఇలా ప్రతి ఒక్కరి నోట పలుకుతున్నది ఒక్కటే ఇండియా జీతేగా అని. లక్ష మందికి పైగా స్టేడియంకు తరలి రానున్నారు. నభూతో నభవిష్యత్ అన్న రీతిలో భారీ ఎత్తున పోలీసు, భద్రతా బలగాలను మోహరించింది కేంద్రం. ఇప్పటికే ఫైనల్ పోరుకు ఆతిథ్యం ఇవ్వనున్న అహ్మదాబాద్ దేదీప్య మానంగా వెలిగి పోతోంది. మరి రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తుందా..తమ జట్టు కోచ్ కు..కోట్లాది మందికి కానుకగా కప్ ఇస్తుందా వేచి చూడాలి.
Also Read : Jagannath Reddy : అల్లుడికి షాక్ మామ జంప్