Perugu Ramakrishna: అంతర్జాతీయ తెలుగు కవి

అంతర్జాతీయ తెలుగు కవి పెరుగు రామకృష్ణ

పెరుగు రామకృష్ణ

Perugu Ramakrishna : పెరుగు రామకృష్ణ: 1960 మే 27 న నెల్లూరు జిల్లా జయంపులో జన్మించిన పెరుగు రామకృష్ణ… జాతీయ అంతర్జాతీయ వేదికలమీద కవితలు వినిపించిన కొద్దిమంది కవుల్లో ఒకరు. రామకృష్ణ తండ్రి వెంకటేశ్వర్లు, సోదరుడు ఫణికుమార్, భార్య సుజనారామం కూడా కవులే. అయితే ఆంగ్ల, తెలుగు భాషల్లో కవిగా గుర్తింపు పొందిన రామృష్ణ సోదరుడు ఫణికుమార్ తన 27వ ఏటనే మరణించారు. వాణిజ్యపన్నుల శాఖలో ఉద్యోగిగా 2020లో పదవీ విరమణ చేసిన రామకృష్ణ(Perugu Ramakrishna) వీరు రాసిన కవిత్వాన్ని “దూదిపింజల వాన” శీర్షికతో కవితా సంపుటిని వెలువరిస్తున్నారు.

Perugu Ramakrishna – రామకృష్ణ రచనా ప్రస్థానం

తండ్రి వెంకటేశ్వర్లు, సోదరుడు ఫణికుమార్ ల ఛందస్సు పద్యాలు, భావ కవితలు అతని మదిలో అక్షరరూపం దాల్చి 15 సంవత్సరాలకే ‘విలువ’ అనే శీర్షికతో కవితలు రాసి ప్రజల హృదయాల్లోకి దూసుకుపోయారు. తన కవిత్వానికి భావకత, పదప్రయోగం రెండు కళ్ళు గా భావిస్తూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమకాలీన సమస్యలమీద ఎన్నో కవితలు ఈయన రాసారు. సూళ్లూరుపేట ప్రాంతంలో వలస వచ్చి విడిదిచేసే సైబీరియా, నైజీరియా పక్షులను కవితావస్తువుగా తీసుకుకొని పక్షలను వలచి, మలచి వ్రాసిన ‘ప్లెమింగో’ కవితా పాఠకుల హృదయాలను వోలలాడించింది. వెన్నెల జలపాతం, ఫ్లెమింగో, నువ్వెళ్ళిపోయాక, ముంజలు, పూలమ్మిన ఊరు, ఒకపరిమళభరిత కాంతి దీపం, దూదిపింజల వాన వంటి ఎన్నో రచనలతో పాటు సుమారు 200 అంతర్జాతీయ సంకలనాల్లో తన ఆంగ్ల అనువాద కవితలు నమోదు చేసుకున్న అరుదైన తెలుగు కవిగా రామకృష్ణ గుర్తింపు పొందారు. కవిత్వం కోసం సుమారు 15 దేశాలకు పైగా పర్యటించి పలు విశ్వ వేదికలపై తెలుగు కవితా వాణి బలంగా వినిపించిన విశేష కవి రామకృష్ణ.

రామకృష్ణను వరించిన అవార్డులు

రామకృష్ణ రచించిన ఫ్లెమింగో ఆంగ్ల సంకలనానకి UWA అవుట్ స్టాండింగ్ ఇంటలెక్చుయల్ ఆఫ్ 21 సెంచరీ అవార్డు లభించింది. రంజనీ కుందుర్తి నేషనల్ అవార్డ్, కజకిస్థాన్‌ సాహిత్య పురస్కారం పదుల సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ పురష్కారాలు, గౌరవ డాక్టరేట్లు రామకృష్ణ అందుకున్నారు.

Also Read : Umar Alisha: తెలుగు గడ్డకు చెందిన ముస్లిం కవి

Leave A Reply

Your Email Id will not be published!