Revanth Reddy Comment : రేవంత్ జోరు కాంగ్రెస్ హుషారు
సీఎం కుర్చీకి పెరిగిన పోటీ
Revanth Reddy : తెలంగాణ దంగల్ చివరి అంకానికి చేరుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. అందరి కళ్లు ఇప్పుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా పేరు పొందిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎనుముల రేవంత్ రెడ్డిపై ఉన్నాయి. ఎక్కడ చూసినా రేవంత్ పేరు మారుమ్రోగుతోంది. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన నేపథ్యంలో కలిగిన ఈ పార్టీలో తలపండిన రాజకీయ నేతలు , ఉద్దండులు ఉన్నారు. రాజకీయం ఎలా చేయాలో, రాజనీతిని ఎలా ప్రదర్శించాలో ఆ పార్టీ తర్వాతే ఎవరైనా. దేశ రాజకీయాలను శాసించే స్థాయికి వచ్చిన వాళ్లు, అలా పేరు పొందిన నేతలంతా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లే. కొందరు విభేదించి బయటకు వెళ్లినా తిరిగి ఇముడలేక స్వంత గూటికి వచ్చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ఎనుముల రేవంత్ రెడ్డి మధ్యతరగతి కుటుంబం నుంచి పైకి వచ్చారు. తొలుత జెడ్పీటీసీగా ప్రారంభమైన ఆయన జీవితం ఆ తర్వాత అంచెలంచెలుగా ఎంపీగా ఎదిగేందుకు దోహద పడింది.
Revanth Reddy Comment Viral
మిడ్జిల్ జెడ్పీటీసీగా గెలుపొందారు తన రాజకీయ జీవితం విచిత్రంగా బీఆర్ఎస్ వ్యవస్థాపకుడు, బాస్ సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ లో చేరాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాడు. కోడంగల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఊహించని రీతిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇదే సమయంలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడు. జైలు శిక్ష అనుభవించాడు. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఇదే సమయంలో బెయిల్ పై బయటకు వచ్చాడు. కాంగ్రెస్ పార్టీలో చేరాక ఆ పార్టీ రేవంత్ రెడ్డికి ఎంపీ గా పోటీ చేసే ఛాన్స్ ఇచ్చింది. అక్కడ గెలుపొందడంతో ఆయన గ్రాఫ్ పెరిగింది. కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందాడు . దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇతర నేతలను కాదని రేవంత్ రెడ్డికి(Revanth Reddy) జై కొట్టింది. ఆయనను టీపీసీసీ చీఫ్ గా నియమించింది.
ఆ తర్వాత రాష్ట్రంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టాడు రేవంత్ రెడ్డి(Revanth Reddy). తనకు పూర్తి సర్వాధికారాలు ఇస్తే
పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకు వస్తానంటూ హామీ ఇచ్చాడు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చోప చర్చలు, వ్యూహాలు కొనసాగాయి. పార్టీ హై కమాండ్ కూడా ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలును నియమించింది. దీంతో పార్టీ రూపు రేఖలను మార్చడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం రేవంత్ , సునీల్ లను కృష్ణార్జనులుగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా పోటీ మాత్రం హస్తం, గులాబీ మధ్య మారి పోయింది. నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి జీవం పోయడంలో ప్రధాన పాత్ర రేవంత్ రెడ్డిది ఉందన్నది వాస్తవం. ఏది ఏమైనా కాంగ్రెస్ గనుక విజయం సాధిస్తే కాంగ్రెస్ పార్టీలో పలువురు సీఎం పోస్టు కోసం పోటీ పడడం ఖాయం. ఏది ఏమైనా హైకమాండ్ కర్ణాటక ఫార్ములాను అనుసరిస్తుందా
అన్నది వేచి చూడాలి.
Also Read : Barrelakka Campaign : దడ పుట్టిస్తున్న బర్రెలక్క