BRS Party Win : తెలంగాణ‌లో గులాబీదే హ‌వా

73 సీట్లు ప‌క్కా వ‌స్తాయ‌న్న తెలుగు స్క్రైబ్

BRS Party  : హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఇంకొన్ని గంట‌లు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి ఓటు వేసేందుకు. న‌వంబ‌ర్ 30న ఓటు వినియోగించు కునేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం. ఇప్ప‌టికే ప‌లు స‌ర్వే సంస్థ‌లు ఫ‌లితాల‌కు సంబంధించిన రిపోర్టుల‌ను విడుద‌ల చేశాయి.

BRS Party Win Viral

తాజాగా నాగ‌న్న స‌ర్వే సంస్థ‌తో పాటు తెలుగు స్క్రైబ్స్ ఒపీనియ‌న్ పోల్ చేప‌ట్టింది. ఇందులో భాగంగా బుధ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను భార‌త రాష్ట్ర స‌మితి (BRS ) పార్టీ మ‌రోసారి రాష్ట్రంలో అధికారంలోకి రానుంద‌ని డిక్లేర్ చేసింది.

గులాబీ పార్టీకి 73 సీట్ల నుంచి 77 సీట్ల దాకా వ‌స్తాయ‌ని తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి 28 సీట్ల నుంచి 32 సీట్లు వ‌స్తాయ‌ని వెల్ల‌డించింది. భార‌తీయ జ‌న‌తా పార్టీకి 4 నుంచి 6 సీట్లు వ‌స్తాయ‌ని తెలిపింది. ముస్లిం సామాజిక వ‌ర్గం మ‌ద్ద‌తు ఉన్న ఎంఐఎం పార్టీకి 6 నుంచి 7 సీట్లు రానున్నాయ‌ని అంచ‌నా వేసింది. ఇండిపెండెంట్ల విష‌యానికి వ‌స్తే 1 నుంచి 3 సీట్లు వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని అభిప్రాయ ప‌డింది.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో 20కి పైగా స‌ర్వే సంస్థ‌లు రిపోర్ట్స్ ప్ర‌క‌టించాయి. అత్య‌ధికంగా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఇచ్చాయి. కొన్ని మాత్ర‌మే గులాబీ పార్టీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుంద‌ని పేర్కొన్నాయి. ఏది ఏమైనా డిసెంబ‌ర్ 3 వ‌ర‌కు వేచి చూడాల్సి ఉంది.

Also Read : JD Lakshmi Narayana : పార్టీ స్థాపిస్తా పోటీలో ఉంటా

Leave A Reply

Your Email Id will not be published!