Seethakka : దొర కేసీఆర్ పతనం ఖాయం
కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కామెంట్
Seethakka : ములుగు – రాష్ట్రంలో కొలువు తీరిన దొర గడీల పాలనకు కాలం చెల్లే సమయం ఆసన్నమైందన్నారు ములుగు శాసన సభ ఎమ్మెల్యే దాసరి సీతక్క(Seethakka). పదేళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ఇక ప్రగతి భవన్ ఖాళీ చేసే సమయం ఆసన్నమైందన్నారు. శనివారం సీతక్క మీడియాతో మాట్లాడారు.
Seethakka Comment
ఈ సందర్బంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చేది ఇందిరమమ్ రాజ్యమేనని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తాను ఓడి పోవాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇతోధికంగా ప్రయత్నం చేశారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని వాపోయారు.
అయితే తనను ఆడ బిడ్డగా ములుగు ప్రజలు ఆదరించారని , చిన్న పిల్లలు సైతం తన వెంట నడిచారని కొనియాడారు. తనను దీవించిన ప్రజలందరికీ, పార్టీ శ్రేణులకు రుణపడి ఉన్నానని అన్నారు దాసరి సీతక్క.
ఇందిర రాజ్యం ఇంటింటా సౌభాగ్యం రానుందని జోష్యం చెప్పారు. మొత్తం 119 నియోజకవర్గాలలో కనీసం 80కి పైగా కాంగ్రెస్ పార్టీకి సీట్లు వస్తాయని అన్నారు. ఈసారి కూడా తాను గెలుస్తానని స్పష్టం చేశారు.
ఇప్పటి వరకు తమ పార్టీకి సంబంధించి వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ హస్తానికి జై కొట్టాయని వెల్లడించారు.
Also Read : 144 Section : ఓట్ల లెక్కింపు వద్ద 144 సెక్షన్