KC Venu Gopal : న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సీఎల్పీ చీఫ్ గా ఎవరు ఎంపిక అవుతారనే దానిపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెర దించింది ఏఐసీసీ హైకమాండ్. సుదీర్ఘ మంతనాలు సాగించిన అనంతరం సీనియర్ల సమన్వయంతో చివరకు పార్టీ కీలక ప్రకటన చేసింది.
KC Venu Gopal Announced
ఉమ్మడి పాలమూరు జిల్లా కొండారెడ్డిపల్లికి చెందిన ఎనుముల రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venu Gopal). మంగళవారం ఆయన మీడియాతో మాట్లడారు. సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డిని తమ సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ముఖ్యమంత్రిగా ఈనెల 7న గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు. ఇదే సమయంలో సీనియర్లకు ప్రాధాన్యత ఉంటుందని, అంతా కలుపుకుని పోతారని, ప్రభుత్వాన్ని నడుపుతారంటూ స్పష్టం చేశారు. ఇక కేబినెట్ విస్తరణకు సంబంధించి చర్చించేందుకు వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఏఐసీసీ ఆదేశించింది.
దీంతో రేవంత్ రెడ్డి హస్తినకు బయలు దేరి వెళ్లారు. ఈ సందర్బంగా తనను సీఎం క్యాండిడేట్ గా ప్రకటించినందుకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కు , సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. తనకు సహకరించిన డీకే శివకుమార్ , మాణిక్ రావు ఠాక్రేకు థ్యాంక్స్ చెప్పారు.
Also Read : Konda Surekha Yashaswini Reddy : బైబై కేసీఆర్..బైబై కవిత