Chinnajeeyar Swamy : కేసీఆర్ ఆరోగ్యంపై చినజీయర్ ఆరా
ఆరోగ్యం ఎలా ఉందంటూ వాకబు
Chinnajeeyar Swamy : హైదరాబాద్ – భారత రాష్ట్ర సమితి పార్టీ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ కాలు జారి పడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది.
Chinnajeeyar Swamy Met KCR
కేసీఆర్ ఆరోగ్యం గురించి తెలిసిన ప్రజా ప్రతినిధులు, మాజీ మంత్రులతో పాటు ప్రముఖులు సైతం ఆస్పత్రికి తరలి వస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఇదిలా ఉండగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి(Chinnajeeyar Swamy) ఇవాళ మాజీ సీఎంను పరామర్శించారు.
ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. స్వామి వారికి ఆరోగ్యం గురించి వివరించే ప్రయత్నం చేశారు సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ ఐటీ మంత్రి కేటీఆర్. స్వామి వారికి సాదర స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రి విరసనోళ్ల శ్రీినివాస్ గౌడ్ కూడా ఉన్నారు.
మరో వైపు రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ సర్కార్ దూకుడు పెంచింది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ చేసిన అన్ని పాపాలు, అక్రమాలపై విచారణకు ఆదేశించింది.
Also Read : Amaravathi Sabha : 17న అమరావతి సభ