Ponnam Prabhakar : కేసీఆర్ ఆరోగ్యంపై పొన్నం ప‌రామ‌ర్శ‌

ఆరా తీసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి

Ponnam Prabhakar : హైద‌రాబాద్ – మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్(Ponnam Prabhakar). ఆదివారం య‌శోద ఆస్ప‌త్రికి వెళ్లారు. అక్క‌డ చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ ను ప‌రామ‌ర్శించారు. ఆయ‌న ఆరోగ్యంపై ఆరా తీశారు.

Ponnam Prabhakar Meet KCR

తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. 119 సీట్ల‌కు గాను కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు రాగా బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు వ‌చ్చాయి. ఇక బీజేపీకి 8 సీట్లు రాగా ఎంఐఎంకు 7 సీట్లు వ‌చ్చాయి. సీపీఐకి ఒకే ఒక్క సీటు వ‌చ్చింది.

ఓట‌మి అనంత‌రం కేసీఆర్ రాజ్ భ‌వ‌న్ కు వెళ్ల‌కుండా రాజీనామా స‌మ‌ర్పించ కుండానే నేరుగా ఫామ్ హౌస్ కు వెళ్లి పోయారు. ఇక్క‌డ బాత్రూంలో కేసీఆర్ జారి ప‌డ్డారు. దీంతో తుంటి ఎముక విరిగింది. ఆయ‌న‌ను హుటా హుటిన య‌శోద ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప‌రీక్ష‌ల అనంత‌రం స‌ర్జ‌రీ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వైద్య బృందం పేర్కొంది.

నిన్న శ‌స్త్ర చికిత్స పూర్త‌యింది. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆందోళ‌న ప‌డాల్సిన ప‌ని లేద‌ని పేర్కొన్నారు. దీంతో విష‌యం తెలుసుకున్న పొన్నం ప్ర‌భాక‌ర్ మాజీ సీఎంను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ఆరోగ్యం ఎలా ఉంద‌ని అడిగారు ఎమ్మెల్యేలు, బావ బావ‌మ‌రుదులు హ‌రీశ్ రావు, కేటీఆర్ ల‌ను.

Also Read : Congress Ministers : ఖ‌మ్మంలో గ్రాండ్ వెల్ క‌మ్

Leave A Reply

Your Email Id will not be published!