Komatireddy Venkat Reddy : కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా
పాత భవనంలోకి శాసన మండలి
Komatireddy Venkat Reddy : హైదరాబాద్ – ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లోని బాత్రూంలో జారి పడ్డ కేసీఆర్ హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఆయనను పరామర్శించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ప్రజా ప్రతినిధులు , మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు. ఇదిలా ఉండగా నిన్నటి దాకా ప్రతిపక్షంలో ఉంటూ ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , రోడ్లు , భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్ ను పరామర్శించారు.
Komatireddy Venkat Reddy
మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ కేసీఆర్ ఆరోగ్యం గురించి వివరించారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి(Komatireddy Venkat Reddy). పరామర్శించిన ఆనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని , తిరిగి అసెంబ్లీకి రావాలని , ప్రజా సమస్యలను ప్రస్తావించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇదే సమయంలో పాత అసెంబ్లీ భవనంలోకి శాసన మండలిని తరలిస్తామని చెప్పారు. పర్యాటక ప్రాంతంగా అసెంబ్లీ ప్రాంగణం ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నట్లు చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొమ్మిది ప్రాజెక్టులకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు.
Also Read : Gunturu Karam : ముద్దు మురిపెం గుంటూరు కారం