Gunturu Karam : ముద్దు మురిపెం గుంటూరు కారం

సోష‌ల్ మీడియాలో మ‌హేష్‌..శ్రీ‌లీల కిస్

Gunturu Karam : మాట‌ల మాంత్రికుడు , దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న గుంటూరు కారం సంచ‌ల‌నంగా మారింది. ఈ చిత్రంలో ప్రిన్స్ మ‌హేష్ బాబుతో పాటు ల‌వ్లీ గ‌ర్ల్ శ్రీ‌లీల జంటగా న‌టిస్తోంది. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ట్రైల‌ర్ దుమ్ము రేపింది.

Gunturu Karam Movie Updates

తాజాగా విడుద‌ల చేసిన రెండో పాట ప్రోమోకు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ వ‌స్తోంది. గ‌తంలో ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం వ‌హించ‌డం లేద‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. కానీ వాట‌న్నింటిని ప‌టాపంచ‌లు చేస్తూ సూప‌ర్ గా బ్యాక్ గ్రౌండ్ ఇచ్చాడు

ప్ర‌స్తుతం శ్రీ‌లీల మహేష్ బాబుకు ముద్దు పెడుతున్న దృశ్యం సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఇక థ‌మ‌న్ ఇచ్చిన మ్యూజిక్ మ్యాజిక్ చేసేలా ఉంది. గుంటూరు కారం(Gunturu Karam) చిత్రాన్ని ఆరు నూరైనా స‌రే వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి లో వ‌చ్చే సంక్రాంతి పండ‌గ రోజు రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు చిత్ర నిర్మాత‌. గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని విధంగా ఈ మూవీ ఉండ బోతోంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా త్రివిక్ర‌మ్, మ‌హేష్ బాబు కాంబినేష‌న్ లో వ‌స్తున్న మూడో చిత్రం ఇది. గ‌తంలో అత‌డు, ఖ‌లేజా తీశాడు. ఈ రెండు బిగ్ స‌క్సెస్ . ప్ర‌స్తుతం విడుద‌ల కాబోయే గుంటూరు కారంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Also Read : Ambati Rambabu : చంద్ర‌బాబుపై అంబ‌టి ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!