Harish Rao : రేవంత్ సీఎంనని మరిచి పోయారు
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఫైర్
Harish Rao : హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ప్రధానంగా సీఎంగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. కనీస నియమ నిబంధనలు తెలుసు కోకుండానే ఎలా పడితే అలా సీఎం మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
Harish Rao Comments on Revanth Reddy
దీనిని ప్రజలు గమనిస్తున్నారని, తమను బయటకు వెళ్లకుండా చేస్తామని చెప్పడం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా అని నిలదీశారు. ఇది ఎంత మాత్రం సమంజం కాదన్నారు హరీశ్ రావు(Harish Rao). ప్రజలు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని అలా అని తాము బానిసలం అయినట్టు సభలో వ్యవహరిస్తుండడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు.
ఇంకా కొన్ని రోజులు ఆగితే పాలన ఎట్లా ఉంటుందో చూస్తారని తాము కూడా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి మాటలేమో ప్రజాస్వామ్యాన్ని వల్లె వేస్తున్నాయని, ఇక చేతలేమో నిరంకుశత్వాన్ని గుర్తుకు తెచ్చేలా చేస్తున్నాయంటూ మండిపడ్డారు తన్నీరు హరీశ్ రావు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే, ప్రశ్నించే స్వేచ్ఛ ఉందని మరిచి పోవద్దన్నారు. అయితే ధర్నా చౌక్ ను బంద్ పెట్టింది ఎవరో తెలుసుకుంటే బెటర్ అని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read : IAS Officers : భారీగా ఐఏఎస్ ల బదిలీలు