JD Laxminarayana : ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం

జై భార‌త్ పార్టీ చీఫ్ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ

JD Laxminarayana : అమ‌రావ‌తి – ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిన స‌మ‌యం ఆస‌న్న మైంద‌ని స్ప‌ష్టం చేశారు సీబీఐ మాజీ చీఫ్ , జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ చీఫ్ జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌. రాష్ట్రంలో రాజ‌కీయాలు శ‌ర వేగంగా మారి పోతున్నాయి. ప్ర‌ధాన పార్టీల‌న్నీ రాబోయే ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెట్టాయి. ఇప్ప‌టి నుంచే ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించాయి. విస్తృతంగా ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు.

JD Laxminarayana Comment about Special Status

రాష్ట్రంలో ఇప్ప‌టికే కొలువు తీరిన వైసీపీ స‌ర్కార్ మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళుతున్నారు. పాల‌నా ప‌రంగా ప‌రుగులు పెట్టిస్తున్నారు.

తాజాగా నాలుగు సంక్షేమ ప‌థ‌కాలపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి ఏపీ రాజ‌కీయ తెర‌పై కొత్త పార్టీ కొలువు తీర‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌ధానంగా జేడీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌కు(JD Laxminarayana) నీతి, నిజాయితీ క‌లిగిన అధికారిగా గుర్తింపు ఉంది.

ఆయ‌న ఇప్ప‌టికే ఇంపాక్ట్ , జేడీ ఫౌండేష‌న్ పేరుతో యువ‌తీ యువ‌కుల‌ను ప్ర‌భావితం చేస్తూ వ‌స్తున్నారు. ఏపీకి హోదా అంశం మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇవాళ విజ‌య‌వాడ‌లో దీనిపై స‌దస్సు ఏర్పాటు చేస్తున్నారు.

Also Read : SP Singh Bhajel : పోషాకాహార లోపాల‌పై ప‌రిశోధ‌న జ‌ర‌గాలి

Leave A Reply

Your Email Id will not be published!