BRS MLA’s Strike : సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న అసెంబ్లీ సిబ్బంది
గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు
BRS MLA’s Strike : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వెళ్లిపోతున్న బీఆర్ఎస్ సభ్యులను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సమావేశం నుంచి ఎమ్మెల్యేలు వెళ్లి మీడియా పాయింట్ వద్దకు మాట్లాడేందుకు వెళ్తుండగా మార్షల్స్ నిలిపివేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశాలు సాధ్యం కాదని అసెంబ్లీ భద్రతా అధికారులు తెలిపారు. కొత్త నిబంధనలు ఏంటి అని ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే ఇలాంటి నిబంధనలు గతంలోనూ ఉన్నాయని అసెంబ్లీ అధికారులు తెలిపారు.
BRS MLA’s Strike Viral
గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని నిరసించారు. ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్దకు చేరుకుని బైఠాయించి నిరసన తెలిపారు. అసెంబ్లీ లోపల మాట్లాడనివ్వడం లేదని… అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడనివ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాపోతున్నారు.
Also Read : Medaram Jatara: ఘనంగా ప్రారంభమైన మేడారం జాతర ప్రత్యేక పూజలు !