KA Paul : జగన్, చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ముగ్గురు మోదీకి తొత్తులే
ఉక్కు కర్మాగారాన్ని రూ.800 వేలకోట్లకు ఎందుకు అమ్ముతారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు
KA Paul : విశాఖ ఎంపీగా గెలిపిస్తే దేశాన్ని కాపాడతానని ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్(KA Paul) అన్నారు. . ఏడేళ్లుగా దేశాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. మంగళవారం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ…ఎస్. కోట ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబు అందరూ మోదీకి తొత్తులని మండిపడ్డారు. జగన్ మళ్లీ గెలిస్తే మోదీకి మద్దతిస్తారని చెప్పారు. మోదీ దత్తపుత్రుడు జగన్ అని ఆయన అన్నారు. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రూ. 500 కోట్ల విలువైన క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలను కొల్లగొట్టారు.
KA Paul Comment
ఉక్కు కర్మాగారాన్ని రూ.800 వేలకోట్లకు ఎందుకు అమ్ముతారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. మోదీ అధికారంలోకి రాగానే దేశాన్ని అమ్మేశారన్నారు. 5వేలకోట్ల అప్పుల్లో ఉన్న శ్రీ జగన్, చంద్రబాబులు…కావాలో …5లక్షల కోట్లు సంపాదించే పాల్ కావాలో ప్రజలు ఆలోచించాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని, అందుకే ఆ పార్టీతో కలవలేదన్నారు. పార్టీలో చేరేది లేదని అన్న కాపు నేత ముద్రగడను నిలదీశారు. తాను ఏ పార్టీకి అమ్ముడుపోనని… మరి ఇప్పుడు జగన్ పార్టీలో ఎందుకు చేరారని ప్రశ్నించారు. తన ఫంక్షన్ హాల్ పన్ను చెల్లించేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను పంపిస్తావా అని కేఏ పాల్ హెచ్చరించారు.
Also Read : Kollu Ravindra TDP : కలెక్టరేట్లో భద్రపరిచిన ఫైల్స్ ఇప్పుడు చెత్తకుప్పలోకి ఎలా వచ్చాయి