Rahul Gandhi: చెప్పులు కుట్టే వ్యక్తికి కుట్టుయంత్రం పంపించిన రాహుల్‌గాంధీ !

చెప్పులు కుట్టే వ్యక్తికి కుట్టుయంత్రం పంపించిన రాహుల్‌గాంధీ !

Rahul Gandhi: ఉత్తర్‌ ప్రదేశ్‌ లో శుక్రవారం తాను కలిసిన చెప్పులు కుట్టుకునే వ్యక్తికి కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ శనివారం కుట్టు యంత్రాన్ని పంపించారు. అమిత్‌ షాపై వ్యాఖ్యల కేసులో సుల్తాన్‌పుర్‌లోని కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన దారిలో రామ్‌ చేత్‌ అనే చెప్పులు కుట్టుకునే వ్యక్తివద్ద ఆగారు. ఆయన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాయం చేస్తానని హామీ ఇచ్చి వెళ్లారు. దీనితో మరుసటి రోజే రామ్‌ చేత్‌ కు కుట్టు యంత్రాన్ని పంపించారు.

ఉత్తర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అన్షు అవస్తీ మాట్లాడుతూ.. ‘జన హృదయ నేత చెప్పులు కుట్టుకునే వ్యక్తి కుటుంబాన్ని కలిసి.. వారి కష్టాలను అర్థం చేసుకున్నారు. అనంతరం వారికి కుట్టు యంత్రాన్ని పంపారు. దీనితో చెప్పులు కుట్టే పని సులువవుతుంది. మా నేతను చూసి గర్విస్తున్నాం’ అని అన్షు అవస్తీ తన సోషల్ మీడియా ఎక్స్‌ లో పేర్కొన్నారు. “రాహుల్ గాంధీ ప్రజల మనిషి అని ఈ సంఘటన తెలియజేస్తుంది. ప్రజా సేవలో ఆయన అంకిత భావం ప్రస్ఫుటమవుతోంది” అని కాంగ్రెస్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Rahul Gandhi – రాహుల్ కి షూలు పంపిన చైత్ !

రాహుల్ సాయంపై ఆనందంతో ఉన్న చైత్… రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి కృతజ్ఞతలు తెలుపుతూ రెండు జతల షూలను పంపాడు. రాహుల్ గాంధీ బృందంలోని కొందరు చైత్ రామ్‌ కు చెప్పులు కుట్టే యంత్రాన్ని ఎలా ఆపరేట్ చేయాలో వివరించారు. రామ్ చైత్ 40 ఏళ్లుగా చెప్పులు కుడుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ కంటపడటంతో ఆయనకు అండగా నిలుస్తామని ప్రకటించారు. రాహుల్ స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన జననేత అని కీర్తిస్తున్నారు. కాంగ్రెస్ పోస్ట్‌ని రీపోస్ట్ చేస్తూ.. కామెంట్లు చేస్తున్నారు.

Also Read : Suryakumar Yadav : శ్రీలంక మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ అదరగొట్టిన సూర్య కుమార్

Leave A Reply

Your Email Id will not be published!