Tamilisai BJP : తమిళనాడు సీఎం స్టాలిన్ పై ఘాటు విమర్శలు చేసిన బీజేపీ నేత తమిళిసై

Tamilisai : పాలన చేతగాకే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, పార్టీని నడపలేక కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సైకిల్‌ తొక్కుతున్నారని తెలంగాణ మాజీ గవర్నర్‌, బీజేపీ నాయకురాలు డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Tamilisai) వ్యంగ్యాస్త్రం సంధించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వీవో చిదంబరనార్‌ 153వ జయంతిని పురస్కరించుకుని హార్బర్‌ నియోజకవర్గంలో ఉన్న ఆయన విగ్రహానికి గురువారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న తమిళుల గురించి రాష్ట్ర పాఠ్య ప్రణాళికలో చేర్చాలని కోరారు.

Tamilisai Comment

తిరుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులను గౌరవించడాన్ని విస్మరించి కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతూ టీచర్లకు వేతనం ఇవ్వలేమని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో రూ.210 కోట్ల విద్యుత్‌ చార్జీలు చెల్లించలేకపోతున్నారని, ఇలాంటి వారు విద్యార్థులకు ఎలా చదువు చెబుతున్నారో తెలియడం లేదన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్‌ సైకిల్‌ తొక్కడంపై స్పందిస్తూ, పాలన చేతకాగ స్టాలిన్‌, పార్టీని నడపలేక రాహుల్‌ గాంధీ సైకిళ్ళు తొక్కుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

Also Read : YS Jagan : ఏపీ మాజీ సీఎం జగన్ పాస్ పోర్ట్ రద్దు చేసిన అధికారులు

Leave A Reply

Your Email Id will not be published!