Minister Nara Lokesh : ‘క్లీన్ అండ్ గ్రీన్’ కోసం సర్వం సిద్ధం చేస్తున్న మంత్రి నారా లోకేష్

కార్మికులను నియమించి గడ్డి తొలగింపు పనులకు మంత్రి లోకేష్ చర్యలు తీసుకున్నారు...

Nara Lokesh : ‘క్లీన్ అండ్ గ్రీన్‌’లో భాగంగా మంగళగిరిలో పరిసరాల పరిశుభ్రతకు మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరిలో ఇవాళ(ఆదివారం) మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా మంగళగిరిలో ‘క్లీన్ అండ్ గ్రీన్‌’కు చర్యలు చేపట్టారు. ఈ పనులను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తానని తెలిపారు.

Minister Nara Lokesh Comment

కార్మికులను నియమించి గడ్డి తొలగింపు పనులకు మంత్రి లోకేష్ చర్యలు తీసుకున్నారు. సొంతంగా 5 గడ్డి తొలగింపు మిషన్ల కొనుగోలుతో పాటు ప్రతి నెలా కార్మికులకు జీతాలు చెల్లించనున్నారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో నియోజకవర్గంలో రోడ్లకు ఇరువైపులా గడ్డి, పిచ్చిమొక్కల తొలగింపు పనులు వేగంగా జరుగుతున్నాయి. మంత్రి లోకేష్ చూపిస్తున్న చొరవ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Minister Ram Mohan Naidu : కీలక అంశాలపై కేంద్ర హోంమంత్రితో భేటీ అయిన విమానయాన మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!