MLA Vasantha Krishna : మాజీ మంత్రి జోగి రమేష్ కి ఘాటు వార్నింగ్ ఇచ్చిన మైలవరం ఎమ్మెల్యే
వీటీపీఎస్బూడిదను కౌంటర్లు పెట్టి అమ్మిన దౌర్బాగ్యులు వీళ్ళంటూ విరుచుకుపడ్డారు...
Vasantha Krishna : ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మార్పు అంశానికి సంబంధించి మాజీ మంత్రి జోగిరమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు రావాల్సిన బిల్లులు రాగానే పార్టీ మారిపోయారంటూ మాజీ మంత్రి ఆరోపణలు గుప్పించారు. అయితే జోగి రమేష్ వ్యాఖ్యలపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జోగి రమేష్ ఒక గొంగళి పురుగు లాంటివాడన్నారు. ‘‘నేను రాజకీయంగా ఆదరించిన మైలవరం నియోజకవర్గంకు మంత్రిగా నువ్వు ఏం ఒరగాపెట్టావో ప్రజలకు చెప్పు’’ అంటూ ప్రశ్నించారు.
MLA Vasantha Krishna Prasad Slams..
వీటీపీఎస్బూడిదను కౌంటర్లు పెట్టి అమ్మిన దౌర్బాగ్యులు వీళ్ళంటూ విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులు వద్ద లంచాలు, బిల్లులు ఇప్పించడానికి జోగి రమేష్, 20, 30 శాతం కమిషన్ తీసుకున్నారని.. తాను ఆధారాలతో సహా నిరూపిస్తానని అన్నారు. ‘‘2019 ఎన్నికల ముందు నువ్వు ఏ ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు ఏ ఇంట్లో ఉంటున్నావు, ఉమ్మడి కృష్ణ జిల్లాలో అత్యంత ధనవంతుడిగా ఎలా మారవో ప్రజలకు తెలుసు’’ అని అన్నారు. హైదరాబాద్లో ఆస్తులను ఏ డబ్బులతో కొన్నావని ప్రశ్నించారు. సొంత బాబాయికి అప్పు ఉండి దొంగ భూములు కట్టబెట్టిన చరిత్ర జోగిదని దుయ్యబట్టారు. అందరికి ఇచ్చినట్టే తనకు పరిశ్రమలు పెట్టినందుకు రాయితీ నగదు ఇచ్చారన్నారు. జగన్ తనకేం ఉదరాతతో నిధులు విడుదల చేయలేదని వెల్లడించారు. ‘‘ నీ ఎదుగుదలకు నారు, నీరు పోసిన మీ బాబాయి వద్ద ఇండస్ట్రీ శాఖ వద్ద నిధులు ఇప్పించి లంచం తీసుకున్నావా లేదా. వెంకటేశ్వరస్వామిని నమ్ముతావో, ఏసు ప్రభువును నమ్ముతావో తెలియదు వందశాతం నువ్వు లంచం తీసుకున్నావు.
Also Read : TG News : తెలంగాణలో పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ