Banu Mushtaq: ‘హార్ట్‌ల్యాంప్’ రచయిత్రి బాను ముస్తాక్ కు బుకర్ ప్రైజ్
‘హార్ట్‌ల్యాంప్’ రచయిత్రి బాను ముస్తాక్ కు బుకర్ ప్రైజ్
Banu Mushtaq : అంతర్జాతీయ స్థాయిలో అత్యంత గౌరవనీయమైన సాహిత్య పురస్కారం, ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ 2025 ను ఈసారి కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ అందుకున్నారు. ఆమె రచించిన చిన్న కథల సంపుటి ‘హార్ట్ ల్యాంప్’కి ఈ పురస్కారం లభించింది. ఈ ఘనత సాధించిన తొలి కన్నడ సాహిత్యకారిణిగా బాను ముస్తాక్(Banu Mushtaq) చరిత్రలో నిలిచారు.
Banu Mushtaq…
ముస్లిం కుటుంబంలో జన్మించిన బాను… పాఠశాల విద్యను అభ్యసిస్తోన్న సమయంలోనే తొలిసారి ఒక షార్ట్ స్టోరీ రాశారు. అయితే, 26 ఏళ్ల వయసులో తన కథ పత్రికలో ప్రచురితమైంది. దీనితో ఆమె ప్రతిభ వెలుగులోకి వచ్చింది. తన తండ్రి ప్రోత్సాహంతో చదువులో రాణించిన ఆమె… కన్నడ భాషపై పట్టు సాధించారు. తర్వాత ఆమె రిపోర్టర్ గా, లాయర్ గా వృత్తిజీవితాన్ని కొనసాగించారు. ఆమె రచయితగానే కాకుండా మహిళల హక్కుల కోసం గళమెత్తారు. మహిళలు ప్రశ్నించకుండా మతం, సమాజం వారిని ఎలాంటి కట్టుబాట్లలో ఉంచుతాయో తన కథల రూపంలో వ్యక్తీకరించారు. మతం లేదా సమాజం మహిళలపై విధించే ఆంక్షలను, ఆపాదించే నియమాలను ఆమె కథల ద్వారా తీవ్రంగా ప్రశ్నించారు. మహిళలు ఎదుర్కొంటున్న బాధలను, వారు ఎదుర్కొంటున్న సంఘర్షణలను ఆమె రచనలలో ప్రతిబింబించారు.
హార్ట్ల్యాంప్తో పాటు ఆరు చిన్న కథల సంకలనాలు, ఒక నవల, మరికొన్ని రచనలు చేశారు. బాను ముస్తాక్ సాహితీ సేవలకు గుర్తుగా కర్ణాటక సాహిత్య అకాడమీ, దాన చింతామణి అతిమబ్బె అవార్డులు అందుకున్నారు. భారతీయ భాషల్లో ఇప్పటి వరకూ హిందీ పుస్తకం (2022లో తంబ్ ఆఫ్ సాండ్, రచన : గీతాంజిలి శ్రీ) మాత్రమే బుకర్ ప్రైజ్‌ను గెలుచుకుంది. 2023లో పెరుమాళ్ మురుగున్ రచించిన తమిళ నవల ఫైర్ షార్ట్ లిస్ట్‌కు ఎంపికయింది. మంగళవారం ప్రకటించిన బుకర్ ప్రైజ్ షార్ట్ లిస్ట్ జాబితా లో ఆన్ ది కాలిక్యులేషన్ ఆఫ్ వాల్యూమ్ (పుస్తకం 1, డానిష్), స్మాల్ బోట్ (ఫ్రెంచ్), అండర్ ది ఐ ఆఫ్ ది బిగ్ బర్డ్ (జపాన్), ఫెరఫెక్షన్ (ఇటాలియన్), హర్ట్ ల్యాంప్ (కన్నడ), ఎ లెపర్ట్ -స్కిన్ హాట్ (ఫ్రెంచ్)లు ఉన్నాయి.
Also Read : AP ICET Results: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల ! టాప్ 10 ర్యాంకర్లు వీరే !
