TDP vs YCP Programs : నేడు ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీగా కార్యక్రమాలు
సాయంత్రం టపాసుల మోతతో దీపావళి సంబరాలు జరుపుకుంటారు...
TDP vs YCP : ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు బుధవారం పోటా పోటీ కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. జూన్ 4వ తేదీ ఏపీలో ఎన్నికలు ఫలితాలు ప్రకటించిన రోజు.. రాష్ట్రంలో అరాచక పాలనకు బుద్ది చెప్పిన రోజు అయినందున ఈరోజు ఉదయం సంక్రాంతి… సాయంత్రం దీపావళి సంబరాలు చేయాలని క్యాడర్‌కు కూటమి నేతలు పిలుపిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకునేందుకు కూటమి నేతలు సిద్దమయ్యారు. అలాగే ఉదయం మహిళలకు రంగవల్లికల పోటీలు నిర్వహిస్తారు. సాయంత్రం టపాసుల మోతతో దీపావళి సంబరాలు జరుపుకుంటారు.
TDP vs YCP Programs Viral
2019 నుంచి 2024 వరకు వైసీపీ(YCP) పాలనను ఓర్పుతో భరించిన ప్రజలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో వైసీపీకి(YCP) బుద్ధి చెప్పారు. వైసీపీని ఓడించడమనే ఏకైక లక్ష్యంతో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ప్రజల్లో నిగూఢంగా దాగున్న వ్యతిరేకత బద్దలైంది. అది 2024 జూన్ 4న ఎన్నికల ఫలితాల రోజున వెల్లడైంది. ఈ తీర్పును జగన్ ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారని అర్థమవుతోంది.
మరోవైపు వెన్నుపోటు దినమంటూ వైసీపీ..
ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఏడాది కాలంలో హామీలు అమలు చేయనందుకు ఈరోజు వెన్నుపోటు దినంగా వైసీపీ ప్రకటించింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ పిలుపిచ్చారు. కాగా ఐదేళ్ల జగన్ పాలనకు చరమ గీతం పాడి… పీడ విరగడ అయిన దినంగా కూటమి నేతలు ప్రకటించారు.
‘ప్రజాతీర్పును శిరసావహిస్తాం.. మాలో లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం.. ఎన్నికల్లో ఓటమిపాలైన ఏ పార్టీ అధినేత అయినా చెప్పే మాటలివి.. కానీ… వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీరే వేరు.. గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన ‘జూన్ 4’ను ఆయన వెన్నుపోటు దినంగా జరుపుకోవాలంటూ పిలుపిచ్చారు. తీర్పు చెప్పిన ప్రజలను వెన్నుపోటుదారులుగా చిత్రీకరిస్తున్నారు. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేయడమేనని ప్రజాస్వామ్య వాదులు పేర్కొంటున్నారు.
మోసం, ద్రోహం, పార్టీ ఫిరాయింపులతో ప్రభుత్వాన్ని పడదోసి, అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటే అది కచ్చితంగా వెన్నుపోటే అవుతుంది. కానీ.. ప్రజాభిప్రాయాన్ని వెన్నుపోటుగా పేర్కొనడం వైసీపీకే చెల్లింది. ఈ ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని తీర్పు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా… 93 శాతం స్ట్రైక్ రేటుతో 175 స్థానాలకు 164 స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అతి భారీ మెజారిటీలు కట్టబెట్టారు. వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేసి… ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. ఇది… ఐదేళ్ల జగన్ అరాచక, నిర్బంధ పాలనపై జనం ఇచ్చిన తీర్పు… దీనినే జగన్ ఇప్పుడు ‘వెన్నుపోటు’గా అభివర్ణిస్తున్నారు.
Also Read : Covid 19 Cases: భారత్ లో నాలుగువేలకు పైగా కోవిడ్ కేసులు ! ఐదుగురి మృతి !
