సిడ్నీ : మద్యం మత్తులో ఉన్న ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సిడ్నీలో పట్టుబడడం కలకలం రేపింది. పీఎస్ఎల్లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. రక్తంలో చట్టబద్ధమైన పరిమితికి మించిన ఆల్కహాల్ స్థాయి నమోదు కావడంతో పాటు మద్యం తాగి వాహనం నడిపినందుకు అభియోగాలు మోపబడ్డాయి. సిడ్నీలోని మరూబ్రాలో తనను తనిఖీ చేశారు. యాదృచ్ఛిక బ్రీత్ టెస్ట్ సందర్భంగా న్యూ సౌత్ వేల్స్ పోలీసులు 39 ఏళ్ల వార్నర్‌ను ఆపినట్లు ఆస్ట్రేలియా మీడియా నివేదించింది. పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి కొద్దిసేపటి ముందు వార్నర్ తన వాహనాన్ని ఆపి పార్క్ చేయడానికి ప్రయత్నించాడని, దీంతో అధికారులు నిలిచి ఉన్న కారు వద్దకు వెళ్లారని నివేదికలు సూచిస్తున్నాయి. రోడ్డు పక్కన నిర్వహించిన పరీక్షలో, అతను ఆమోద యోగ్యమైన పరిమితికి మించి మద్యం సేవించినట్లు తేలింది.
పోలీస్ స్టేషన్లో, వార్నర్ రక్తంలో ఆల్కహాల్ స్థాయి 0.104గా నమోదైనట్లు సమాచారం. ఇది ఆస్ట్రేలియాలో చట్టబద్ధమైన పరిమితికి రెట్టింపు కంటే ఎక్కువ. తదనంతరం అతనిపై అభియోగాలు మోపి, అరెస్టు చేసి, మరూబ్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వచ్చే నెలలో కోర్టులో హాజరు కావాలని ఈ మాజీ ఆస్ట్రేలియా బ్యాటర్‌ను ఆదేశించారు. ఒక వ్యాన్ పరీక్షా కేంద్రానికి కొద్ది దూరంలో ఆగి పార్క్ చేసినట్లు గమనించబడింది. ట్రాఫిక్ , హైవే పెట్రోల్ కమాండ్‌కు చెందిన అధికారులు ఆ వాహనం వద్దకు వెళ్లి, డ్రైవర్‌కు (39 ఏళ్ల వ్యక్తి) రోడ్డు పక్కనే పరీక్షలు నిర్వహించగా, అతనికి పాజిటివ్ ఫలితం వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. కాగా వార్నర్ అని పేర్కొనక పోవడం గమనార్హం.
