సంక్షేమ ప‌థ‌కాల జోరు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హుషారు

మైనార్టీల సంక్షేమానికి రూ. 3,670 కోట్లు ఖ‌ర్చు

అమ‌రావ‌తి : సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ రాష్ట్రంగా రూపు దిద్దుకుంటోంది చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం. ఎన్నిక‌ల హామీల‌లో చాలా వాటిని అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ఏడాది మైనారిటీ సంక్షేమానికి రూ. 3,670 కోట్లు ఖ‌ర్చు చేశారు. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనంకు రూ.51 కోట్లు , ఇమామ్‌లకు నెలకు రూ.10,000 మౌజన్లకు రూ.5,000 చొప్పున ఏడాదికి రూ.90 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది స‌ర్కార్. వక్ఫ్ బోర్డు పునరుద్దరణ చేప‌ట్ట‌డం, అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తోంది. పురోహితులకు నెలకు రూ.15,000కు ,నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25,000కు వేతనాల పెంచింది. మగ్గాలున్న చేనేతలకు 200, మరమగ్గాలున్న చేనేతలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తోంది. జూనియర్ లాయర్లకు రూ.10,000 గౌరవ వేతనం ఇస్తోంది. మెగా డీఎస్సీ కోసం ముఖ్యమంత్రి తొలి సంతకం చేశారు. చెప్పిన‌ట్టు గానే . 15,941 టీచర్ పోస్టుల భర్తీ చేసింది కూట‌మి ప్ర‌భుత్వం.

5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి, రూ.4,500 నుంచి రూ.12,500కు స్టైఫండ్ పెంచింది. 10 వేలకుపైగా పోస్టులతో జాబ్ కేలండర్ విడుదల చేసింది. భవిష్యత్ నగరంగా అమరావతి నిర్మాణం – శాశ్వత, ఏకైక రాజధానిగా కేంద్రం గెజిట్ జారీ చేసేలా చంద్ర‌బాబు చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించింది. ఉచిత ఇసుక విధానంతో నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చింది. జె బ్రాండ్స్ రద్దు చేసి, నాణ్యమైన మద్యం సరఫరా- బెల్ట్ షాపుల నియంత్రణ కోసం చ‌ర్య‌లు చేప‌ట్టింది. అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేసింది. బాలింతలకు మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించింది. చెత్త పన్ను రద్దు చేసి దాదాపు 84 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ తొలగించింది. ప్రతీ నెల ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’. డోర్ టు డోర్ కలెక్షన్. స్వచ్ఛ రథాలు న‌డుపుతోంది.

Leave A Reply

Your Email Id will not be published!