బెంగ‌ళూరు డీలా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ భ‌ళా

ఉత్కంఠ పోరులో మిచెల్ మార్ష్ సూప‌ర్ ఇన్నింగ్స్

ల‌క్నో : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో వ‌రుస ప‌రాజ‌యాల‌తో తీవ్ర నిరాశ‌కు గురి చేస్తూ వ‌చ్చిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో దుమ్ము రేపింది. టాప్ -4 లో పాయింట్ల ప‌ట్టిక‌లో కొన‌సాగుతూ వ‌చ్చిన డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు కోలుకోలేని రీతిలో ఝ‌ల‌క్ ఇచ్చింది. 9 ప‌రుగుల తేడాతో ఓడించింది.

ల‌క్నో జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ కు దిగింది. ఆ జ‌ట్టుకు చెందిన మిచెల్ మార్ష్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు. ప‌వ‌ర్ ప్లే లో భారీ ఎత్తున ప‌రుగులు రాబ‌ట్టారు బ్యాట‌ర్లు. మిచెల్ మార్చ్ కేవ‌లం 56 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని సూప‌ర్ సెంచ‌రీ చేశాడు. ఇందులో 9 ఫోర్లు 9 సిక్స‌ర్లు ఉన్నాయి. త‌న‌కు తోడుగా నికోల‌స్ పూర్ 38 ర‌న్స్ చేస్తే రిషబ్ పంత్ 10 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 2 సిక్స్ ల‌తో 38 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఈ మ్యాచ్ కు వ‌రుస‌గా వ‌ర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో మ్యాచ్ ను అంపైర్లు 19.2 ఓవ‌ర్లుకు కుదించారు. దీంతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 213 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో చివ‌రి దాకా పోరాడింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. ఆ జ‌ట్టు 6 వికెట్లు కోల్పోయి 209 ప‌రుగుల‌కే ప‌రిమితం అయ్యింది. ఆర్సీబీ కెప్టెన్ ర‌జిత్ పాటిదార్ 31 బంతులు ఆడి 3 ఫోర్లు 5 సిక్స‌ర్ల‌తో 61 ర‌న్స్ చేస్తే డేవిడ్ 17 బంతుల‌లో 4 ఫోర్లు 3 సిక్సుల‌తో 40 ర‌న్స్ చేశాడు.

Leave A Reply

Your Email Id will not be published!