అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఆలయాల అభివృద్దికి కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఏపీని ఆధ్యాత్మిక హబ్ గా మారుస్తామన్నారు. రాష్ట్రంలోని 15 ప్రధాన దేవాలయాల్లో నిత్యం అన్నదానం చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ ను యక్షన్ ప్లాన్ రూపొందించాలని అన్నారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ , విశాఖ ఐటీ హబ్ – టీసీఎస్ ప్రారంభం, కాగ్నిజెంట్‌కు శంకుస్థాపన చేశామన్నారు. 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదల, 90కిపైగా సీఎస్ఎస్ పథకాల పునరుద్ధరణ, ప్రతీ ఇంటికి అమరజీవి జలధార పేరుతో మంచినీటి కుళాయి కనెక్షన్లు, 100 రోజుల్లోనే హంద్రీనీవా కాలువ విస్తరణ, రాయలసీమలో అన్ని చెరువులు, ప్రాజెక్టులు నింపి సాగు, తాగునీరు అందజేస్తామని ప్రకటించారు సీఎం.
సాగునీటి ప్రాజెక్టులకు 23 నెలల్లో రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. శరవేగంగా పోలవరం నిర్మాణం – డయాఫ్రం వాల్ పూర్తి – విశాఖకు నీళ్లు, రూ.2 వేల కోట్లతో పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామన్నారు చంద్రబాబు నాయుడు. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.571 కోట్లు వ్యయం – జులై నాటికి తొలి దశ పూర్తి చేస్తామని, తుంగభద్ర గేట్ల మరమ్మతులు పూర్తి చేసేందుకు ఏపీ వాటాగా రూ.55 కోట్ల కేటాయించినట్లు తెలిపారు. చింతలపూడి ఎత్తిపోతల అనుమతుల్లో పురోగతి కొనసాగుతోందన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల మరమ్మతులకు రూ.610 కోట్లతో మరమ్మతులు, రాష్ట్ర వ్యాప్తంగా కాలువల నిర్వహణ, పూడికలతీత, లాకుల మరమ్మతులకు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు సీఎం. 6,047 సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు సీఎం.