వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రప్రెన్యూర్‌లో ఎంఎస్ఎంఈలు కీలకం
స్పష్టం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రప్రెన్యూర్‌లో ఎంఎస్ఎంఈలు కీలకం పాత్ర పోషిస్తాయని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . అమరావతి లోని సచివాలయంలో జరిగిన 17వ ఎస్ఐపిబి సమావేశంలో 25 ప్రాజెక్టులకు చెందిన రూ.2,01,023 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 39,067 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్బంగా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పెట్టుబడుల విషయంలో భారీ పరిశ్రమలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో…ఎంఎస్ఎంఈలకు అంతే ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. అన్ని పారిశ్రామిక ప్రాంతాలకు గ్యాస్ పైప్ లైన్ అందుబాటులో ఉండేలా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ లో రంగంలో రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వాటిని సద్వినియోగం చేసుకుని పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని ఆదేశించారు సీఎం. మన రాష్ట్రంలో ఉద్యాన, వాణిజ్య పంట ఉత్పత్తులకు విలువ జోడింపు జరగాలన్నారు. ఆయిల్ పాం, మామిడి, కొబ్బరి, కోకో సహా పలు పంటలకు వ్యాల్యూ అడిషన్ ఇస్తే రైతులకు ఎంతో మంచి జరుగుతుందని చెప్పారు చంద్రబాబు ఈ సమావేశంలో సీఎస్ సాయిప్రసాద్, మంత్రులు టీజీ భరత్, అచ్చెన్నాయుడు, సుభాష్, వివిధ శాఖల అధికారులు, వర్చువల్‌గా మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, సానుకూల దృక్ఫథంతో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రథమ ప్రాధాన్యత అన్ని రంగాలలో స్వయం సమృద్దిని సాధించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. ఇప్పటికే ఏపీ లో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు రానుండడం శుభ పరిణామమని పేర్కొన్నారు.