తమిళనాడు : తమిళనాడులో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు ఊహించని విధంగా వచ్చాయి. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఝలక్ ఇస్తూ కేవలం 2 సంవత్సరాల పార్టీ టీవీకే అద్భుత విజయాన్ని నమోదు చేసింది. 234 సీట్లకు గాను 111 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రాష్ట్రంలో అవతరించింది. ఈ సందర్బంగా సామాన్యులకే ప్రయారిటీ ఇచ్చారు విజయ్. అంతే కాదు తనను నమ్ముకుని ఉన్న డ్రైవర్ కుటుంబాన్ని ఆశ్చర్య పోయేలా చేశాడు. ఏకంగా డ్రైవర్ కొడుకు ధాము విజయ్ కి టికెట్ ఇచ్చాడు. తను గెలుపొంది విస్మయానికి గురి చేశాడు విజయ్. పాలనా పరంగా తనదైన ముద్ర ఉండాలని తలపించే పార్టీ చీఫ్ రాబోయే రోజుల్లో ఇంకేం చేస్తాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉండగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన జయకుమార్, మాజీ మంత్రి రెహ్మాన్ ఖాన్ కుమారుడు సుబైర్ ఖాన్‌లపై ధాము విజయ్ గ్రాండ్ విక్టరీ నమోదు చేయడం విశేషం. తన పార్టీలో కులం, మతానికి , రాజకీయాలకు తావు లేదని ప్రకటించాడు. ఆ మేరకు అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా మేనిఫెస్టో ప్రకటించాడు. ఇది ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా చేసింది. ప్రత్యేకించి యువత, మహిళలు తనకు బ్రహ్మరథం పట్టారు. భారీ విజయాన్ని కట్టబెట్టారు. విజయ్ డ్రైవర్ కుమారుడు శబరినాథన్ విరుగంబాక్కంలో టీవీకే తరఫున గెలుపొందారు. ఎన్నికలలో భాగంగా వినూత్న ప్రచారంతో ప్రజలను ఆకట్టుకున్నాడు విజయ్. అనామకులు, సామాన్యులకు ప్రయారిటీ ఇచ్చాడు. వారికి టికెట్లు కేటాయించడం ఇతర పార్టీలకు ఇబ్బందిగా మారింది. ఇక పవర్ ను కోల్పోయిన సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
