ఈ విక్ట‌రీ హిందూత్వానికి ద‌క్కిన విజ‌యం

బీజేపీ సీఎం అభ్య‌ర్థి సువేందు అధికారి

ప‌శ్చిమ బెంగాల్ : ప‌శ్చిమ బెంగాల్ లో సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన టీఎంసీ పార్టీ చీఫ్ , మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి కోలుకోలేని రీతిలో షాక్ త‌గిలింది. అనూహ్యంగా బెంగాల్ చ‌రిత్ర‌లో అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. 173 సీట్ల‌కు పైగా కైవ‌సం చేసుకుని ఒంట‌రిగానే ఏ ఒక్క‌రి పొత్తు లేకుండానే ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఇందుకు సంబంధించి మాస్ట‌ర్ ప్లాన్ వేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. దాంతో పాటు తీవ్ర వివాదాస్ప‌దంగా మారిన త‌మిళ‌నాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌విని ఎన్నిక‌ల కంటే బ‌దిలీ చేసింది. ఆయ‌న‌ను ఏరికోరి ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ గా అపాయింట్ చేసింది. ఇదే స‌మ‌యంలో త‌న‌కు అనుకూలంగా ఈసీని కూడా మార్చేసింద‌ని సంచల‌న ఆరోప‌ణ‌లు చేశారు మ‌మ‌తా బెన‌ర్జీ.

ఇక ఎన్నిక‌ల అనంత‌రం బీజేపీ స్టార్ లీడ‌ర్, ఒక‌ప్ప‌టి దీదీ అనుచ‌రుడిగా పేరు పొందిన సువేందు అధికారి ఇప్పుడు దీదీ స్థానంలో సీఎంగా కొలువు తీర‌నున్నారు. మ‌రో వైపు ఉత్త‌రాదిన బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తే ద‌క్షిణాదిన మాత్రం ఆ పార్టీకి ఇంకా ప‌ట్టు దొర‌క‌డంలేదు. అమిత్ షా ఎన్ని వ్యూహాలు ప‌న్నినా ఇక్క‌డ ఉత్త‌రాధి ఆధిప‌త్యాన్ని ప్ర‌జ‌లు స‌హించ‌రని తేలి పోయింది. కేర‌ళ‌లో యుడీఎఫ్, పుదుచ్చేరిలో ఎన్డీయే , త‌మిళనాడులో టీవీకే , అస్సాంలో బీజేపీ, ప‌శ్చిమ బెంగాల్ లో తొలిసారిగా కాషాయ జెండా ఎగుర వేసింది. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం సువేందు అధికారి మీడియాతో మాట్లాడారు .మమతా బెనర్జీని ఓడించడం అత్యంత కీలకం అన్నారు. ఇది మమతా బెనర్జీ రాజకీయాల నుండి విరమణ తీసుకున్నట్లేన‌ని ఎద్దేవా చేశారు. అమిత్ షా నాకు రెండు లేదా మూడు సార్లు ఫోన్ చేశారు. భబానీపూర్ విషయమై ఆయన కొంత ఆందోళన కూడా వ్యక్తం చేశారని అన్నారు. ఈ విజయం హిందుత్వానికి లభించిన విజయం అన్నారు .

Leave A Reply

Your Email Id will not be published!