జ‌గ‌న్ మావిగ‌న్ డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ : గొట్టిపాటి ర‌వికుమార్

త‌న పార్టీని 11 సీట్ల‌కే ప‌రిమితం చేసినా బుద్ది రాలేదు

అమ‌రావ‌తి : ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజ‌ధాని గురించి ప‌దే ప‌దే అబ‌ద్దాల‌ను ప్ర‌చారం చేస్తూ జ‌నాన్ని క‌న్ ఫ్యూజ్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. జ‌నం త‌న‌ను న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. ఆ విషయం తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. జగన్ మావిగన్ సవాల్ కు మంత్రి గొట్టిపాటి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రం మీద, ప్రజల మీద ద్వేషం పెంచుకున్నందుకే జగన్ పూటకో మాట మాట్లాడుతున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు గొట్టిపాటి ర‌వికుమార్.

రాష్ట్రం అంటే సవాళ్లు కాదు అభివృద్ధి అని జగన్ తెలుసుకుంటే మంచిద‌ని సూచించారు. మూడు రాజధానుల మాటేమైంద‌ని మీడియా అడిగితే సమాధానం చెప్పలేక పారిపోయాడ‌ని ఎద్దేవా చేశారు. మావిగన్ పాట ముమ్మాటికీ రాష్ట్రం పై తన కక్ష సాధింపు కోసమే త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదనే క్రిమినల్ అజెండాతో జగన్ పని చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. మూడు రాజధానుల పిచ్చి సిద్ధాంతమే గొడ్డలి పార్టీకి 11 సీట్లు వ‌చ్చేలా చేసింద‌న్నారు. మావిగన్ సిద్దాంతంతో ఇక సింగిల్ డిజిట్ ఖాయం అని జోష్యం చెప్పారు గొట్టిపాటి ర‌వికుమార్. రాజధాని విషయంలో జగన్ రోజుకో మాట మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. .30 వేల ఎకరాలకు తగ్గకుండా చూడండి అని నాడు అసెంబ్లీలో జగన్ చెప్పాడా? లేదా? అని ప్ర‌శ్నించారు. అమరావతిలో ఇల్లు కట్టుకున్నా ఇక్కడే ఉంటానని చెప్పావా? లేదా? మ‌రి ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నాంటూ నిల‌దీశారు.

Leave A Reply

Your Email Id will not be published!