‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్ లాంచ్

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా

హైదరాబాద్ : టాలీవుడ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి హారర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రాబోతోంది. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన‌ హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌తో పాటు రెండు ప్రత్యేక గీతాలను విడుదల చేశారు. అలాగే సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.

సూపర్ స్టార్ కృష్ణ నటించిన పలు చిత్రాల టైటిళ్లను గుర్తు చేస్తూ రూపొందించిన ఈ సినిమాలోని ప్రత్యేక గీతాన్ని కృష్ణ అభిమానుల చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటలో కృష్ణ వీరాభిమాని, నటుడు కృష్ణసాయి నటించడం విశేషం. కృష్ణసాయి, ప్రీతి సుందర్ ఈ గీతంలో కనిపించగా, రచన-సంగీతాన్ని దర్శకుడు సంజీవ్ మేగోటి అందించారు. అలాగే కృతి వర్మ స్పెషల్ అప్పియరెన్స్‌లో నటించిన “నువ్వట్టా సూత్తా ఉంటే” అనే మరో గీతాన్ని తెలంగాణ డీఐజీ రమణారెడ్డి విడుదల చేశారు.

కార్యక్రమంలో తెలంగాణ డీఐజీ రమణారెడ్డి, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, సీనియర్ నిర్మాత ఆర్. సీతారామరాజు, సూపర్ స్టార్ కృష్ణ మేకప్‌మెన్ మాధవరావు, నిర్మాత ఘంటా శ్రీనివాసరావు, డిస్ట్రిబ్యూటర్ నరేంద్ర, పీఆర్ఓ శర్మ, డిస్ట్రిబ్యూటర్ సిరాజ్, ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజాసేన జాతీయ అధ్యక్షులు ఖాదర్ గోరి, నటులు కృష్ణసాయి, కృతి వర్మ, ప్రీతి సుందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!