సంజీవని కార్య‌క్ర‌మం ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు వ‌రం

కీలక వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ తీసుకు వ‌చ్చిన సంజీవ‌ని కార్య‌క్ర‌మం ఏపీకి వ‌రంగా మారింద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మార్కాపురం జిల్లా గిద్దలూరులోని కె.ఎస్ పల్లెలో సంజీవని కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛగా ఉన్న మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతోనే జిల్లాలను పునర్వవస్థీకరించామ‌ని తెలిపారు. గత పాలన విధ్వంసంతో నలిగి పోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిగా ఏర్పాడ్డాయని చెప్పారు. రూ.10 లక్షల కోట్ల అప్పు, వ్యవస్థల విధ్వంసం గత పాలనలో చోటు చేసుకుంది. నలుగురు వ్యక్తులు కలిసి మాట్లాడుకోలేని పరిస్థితి నెల‌కొంద‌న్నారు. నేడు మనం అంతా కలిసి స్వేచ్ఛగా మాట్లాడుకో గలుగుతున్నాం అని అన్నారు. ఇదే అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా అని పేర్కొన్నారు సీఎం. బ్లేడు, గంజాయి బ్యాచ్ లు రాబందులు తరహాలో వేచి ఉన్నారని హెచ్చ‌రించారు.

ఏం జరక్కపోయినా నేరాలు చేసి ఎవరో ఒకరిపై నెట్టేసి డైవర్ట్ చేసేది గొడ్డలి పార్టీ అంటూ ఆరోపించారు.
స్త్రీ శక్తితో ఉచిత ప్రయాణం, దీపం 2.0 లాంటి పథకాలను మహిళలకు ప్రత్యేకంగా అమలు చేస్తున్నాం
అన్నదాతకు అండగా ఉండేలా మొదటి విడత నిధులు విడుదల చేశాం. వచ్చే నెలలో తల్లికి వందనం పథకం కింద తల్లుల ఖాతాలో నిధులు జమ చేస్తాం. మనసు ఉంది కాబట్టే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల పరపతి పెరిగింది. చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య సేవలు అందించేలా సంజీవని కార్యక్రమం అమలు చేస్తున్నామ‌ని చెప్పారు సీఎం. క్వాంటం, ఏఐ లాంటి వివిధ అధునాతన టెక్నాలజీలను అందుబుటులోకి తీసుకు వస్తున్నాం అన్నారు. రాష్ట్రంలో ఉండే ప్రతీ ఒక్కరి ఆరోగ్యాన్ని సంజీవని ద్వారా పరిరక్షిస్తాం అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!