ఉత్తర ప్రదేశ్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయోధ్య రామ మందిరం నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలు. భారీ ఎత్తున విరాళాలు సేకరించారని, అవన్నీ పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు సీఎం యోగి ఆదిత్య నాథ్. సిట్ పూర్తిగా విచారణ చేపట్టింది. ఈ విరాళాలను పక్కదారి పట్టించారని కేసు నమోదైంది. మొత్తం ఎనిమిది మందికి పైగా కేసులు నమోదు చేశారు. వీరిని అదుపులోకి తీసుకున్నారు ఇటీవలే. తాజాగా రోజు రోజుకు మరికొన్ని అక్రమాలు బయట పడుతుండడంతో శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్‌కు చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలు చేశారు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తన ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాల రాజీనామాలను స్వీకరించినట్లు అధికారికంగా ధృవీకరించింది. ఈ రాజీనామాలను పరిశీలన కోసం ట్రస్ట్ తదుపరి సమావేశంలో ఉంచుతామని ట్రస్ట్ పేర్కొంది. అయోధ్య రామమందిరానికి సంబంధించిన ఇటీవలి పరిణామాల పట్ల తాము “తీవ్ర విచారం, బాధ , తీవ్ర ఆవేదన” చెందామని ట్రస్ట్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. విరాళాలకు సంబంధించిన అవకతవకల ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సమర్పించిన మధ్యంతర నివేదిక ఆధారంగా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు కూడా ట్రస్ట్ ధృవీకరించింది. ఈ వ్యవహారానికి సంబంధించి చట్ట పరమైన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని కూడా అది పేర్కొంది.
