తెలంగాణకు 736 కేజీబీవీలు మంజూరు : ప్రహ్లాద్ జోషి
పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాల సందర్బంగా కేంద్ర మంత్రి
న్యూడిల్లీ : తెలంగాణ రాష్ట్రానికి తీపికబురు చెప్పారు కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. ఈ సందర్బంగా ఈ ఒక్క రాష్ట్రానికి కొత్తగా 736 కేజీబీవీలు మంజూరు చేశామన్నారు.ఒక్క మెదక్ జిల్లాలో 26 కేటాయించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకమైన ‘సమగ్ర శిక్ష’ కింద కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల తో సహా వివిధ కార్యక్రమాల కోసం రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి సోమవారం తెలిపారు. తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు తమ అవసరాలు , ప్రాధాన్యతల ఆధారంగా వార్షిక పని ప్రణాళిక , బడ్జెట్‌ను రూపొందిస్తాయని చెప్పారు. ఆ తర్వాత పథకం కార్యక్రమం, ఆర్థిక నిబంధనలు అలాగే బడ్జెట్ వనరుల లభ్యతను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
ఆయా రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలతో సంప్రదింపుల ద్వారా ‘ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డ్’ ఈ ప్రణాళికను పరిశీలించి ఆమోదిస్తుందని చెప్పారు ప్రహ్లాద్ జోషి. భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్‌లో ‘విద్య’ అనేది ఉమ్మడి జాబితా పరిధిలోకి వస్తుందన్నారు. కాబట్టి చాలా వరకు పాఠశాలలు సంబంధిత రాష్ట్ర , కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల పరిపాలనా నియంత్రణలో ఉంటాయని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ పథకం రాష్ట్ర , కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు లేదా యంత్రాంగాల భాగస్వామ్యంతో అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ,ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలల్లోని బాల్‌వాటిక 1 నుండి 8వ తరగతి వరకు చదువుతున్న పిల్లలందరికీ వేడి పోషకమైన భోజనాన్ని అందించే బాధ్యత ఆయా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు , యంత్రాంగాలపై ఉంటుందన్నారు.
