జాతీయ జెండాను ఆవిష్క‌రించే మంత్రులు వీరే

ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ

హైద‌రాబాద్ : టీపీసీసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సంద‌ర్బంగా రాష్ట్రంలోని 32 జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే మంత్రులు, ప్ర‌ముఖుల‌ను ఎంపిక చేసింది. ఈ మేర‌కు అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఆగస్టు 15న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్న‌ట్లు తెలిపింది.హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో ఉదయం 10:00 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో ఉదయం 9:30 గంటలకు మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, శాసనసభ/శాసనమండలి ప్రముఖులు, ప్రభుత్వ సలహాదారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించనున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ జాతీయ జెండాను ఆవిష్క‌రిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హనుమకొండ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల‌లో మంత్రి మహ్మద్ అజహరుద్దీన్, జయశంకర్ భూపాలపల్లి లో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి , జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి , కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు , కరీంనగర్ లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఖమ్మం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జెండా వంద‌న కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు.

కుమురంభీం ఆసిఫాబాద్ లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ , మహబూబాబాద్ లో ప్రభుత్వ విప్ జె. రాంచందర్ నాయక్ , మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మంచిర్యాల లో ప్రభుత్వ సలహాదారు హరకర వేణుగోపాల్ రావు , మెదక్ లో మంత్రి వివేక్ వెంకటస్వామి, మేడ్చ‌ల్ లో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ,ములుగు జిల్లాలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి , నల్గొండ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి , నారాయణపేట జిల్లాలో మంత్రి వాకిటి శ్రీహరి , నిర్మల్ లో ప్రభుత్వ విప్ వెముల వీరేశం ఆవిష్క‌రించ‌నున్నారు.

నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ సలహాదారు పి. సుధర్శన్ రెడ్డి , పెద్దపల్లి లో ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు , రాజన్న సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , రంగారెడ్డి జిల్లాలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు , సంగారెడ్డి లో మంత్రి దామోదర రాజనర్సింహ , సిద్దిపేట లో మంత్రి పొన్నం ప్రభాకర్ ,
సూర్యాపేట లో మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, వికారాబాద్ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , వనపర్తి జిల్లాలో శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి , వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ ,యాదాద్రి భువనగిరి జిల్లాలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాల‌ను ఆవిష్క‌రిస్తార‌ని టీపీసీసీ ప్ర‌క‌టించింది.

Leave A Reply

Your Email Id will not be published!