దళిత వ్యతిరేక విధానం బీజేపీ ఎజెండా : ష‌ర్మిలా రెడ్డి

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ చేసిన హవనందళితుల వ్యక్తిత్వానికి జరిగిన హననం అని పేర్కొన్నారు.దళితుల పట్ల వివక్ష బీజేపీ సిద్ధాంతం అని, దళిత వ్యతిరేక విధానం బీజేపీ ఎజెండా అని మండిప‌డ్డారు. కులవివక్ష, కులమతాల మధ్య విభేదాల సృష్టించ‌డం త‌ప్ప చేసింది ఏమీ లేద‌ని అన్నారు. రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గేజీ అడుగుపెట్టిన స్థలాన్ని శుద్ధి చేశారంటే అది బీజేపీ అంటరానితనం, అసమానతలకు అద్దం ప‌డుతుందన్నారు. ఈ ఘటన దళితుల మీద ప్రత్యక్షంగా చూపించిన ఒక సామాజిక వివక్ష త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు ష‌ర్మిలా రెడ్డి . మీకు తెలుసు, నిన్న హాల్ద్వానిలో బీజేపీ, హిందుత్వ సంఘాలు కాంగ్రెస్ ర్యాలీ చేసిన స్థలాన్ని గంగాజలాలతో శుద్ధీకరణ చేశాయన్నారు.

ప్రియతమ నాయకులు మల్లికార్జున ఖర్గే అక్కడ ఉండడాన్ని అవమానిస్తూ అయన ఉనికివలన ఆ ప్రాంతం అపవిత్రం అయిందంటూ చేసిన ఈ శుద్ధీకరణ కార్యక్రమం సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే విధంగా తీవ్రమమైన వ్యతిరేక, వివక్ష భావనలను రేకెత్తించే విధంగా ఉందన్నారు ఏపీపీసీసీ చీఫ్‌. ఇది బీజేపీ కుల దురహంకార బుద్ధికి, విభజన మనస్తత్వానికి అద్దం పడుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సిగ్గుమాలిన చర్యలను తీవ్రంగా ఖండిస్తూ, వ్యతిరేకిస్తున్నామ‌న్నారు. దళిత మహోగ్ర శిఖరమైన మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని అవమానించినదిగా ఉందంటూ యావత్ దేశం నిరసిస్తోందన్నారు.

సమానత్వ, ఏకత్వం, సామజిక న్యాయాన్ని, రాజ్యాంగ విలువలనూ తునాతునకలు చేస్తున్న ఈ విపరీత రాక్షస చర్యను ఖండిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఉద్యమానికి సిద్ధమవుతోంద‌ని అన్నారు షర్మిలా రెడ్డి..ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆగష్టు 14 సాయంత్రం, భారీ మార్చ్ , సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!