స‌ర్ ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి

టీపీసీసీ జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అమ‌రావ‌తి : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న స‌ర్ పై సీరియ‌స్ గా స్పందించారు. ఈ ప్రక్రియలో భాగంగా 21 శాతం ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇంచార్జ్ మంత్రుల నుంచి బూత్ లెవెల్ వరకు సరైన బాధ్యత తీసుకోక పోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తక్షణమే సంబంధిత ఇంచార్జ్ మంత్రులు జిల్లాల్లో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులతో సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉంద‌న్నారు. రెండు రోజులు క్షేత్ర స్థాయికి వెళ్లి జిల్లాల్లో సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా ఇంచార్జ్ మంత్రులు ప్రతీ నియోజకవర్గానికి సంబంధించి నివేదిక తయారు చేయాల్సిందే న‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

అసెంబ్లీ ఇంచార్జులు 4 రోజులు నియోజకవర్గంలో ఉండి సమస్యలు తెల్సుకుని పూర్తి స్థాయిలో పరిష్కరించాల‌ని పేర్కొన్నారు. సరైన కార్యాచరణతో ముందుకు వెళ్లకపోతే పార్టీ ఉపేక్షించదని హెచ్చ‌రించారు. ఇవి ఏఐసీసీ నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు వ‌చ్చాయ‌ని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి. పకడ్బందీ కార్యాచరణతో వెళ్లకపోతే భవిష్యత్ లో రాజకీయంగా పెద్ద నష్టం జరుగుతుందని వాపోయారు. స‌ర్ లో సమస్యలను పరిష్కరించడంతో పాటు బీజేపీ, బీఆరెస్ కలిసి చేస్తున్న ఓట్ల తొలగింపు కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ముందుకు పోవాల‌న్నారు సీఎం. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి బాధ్యులుగా ఉన్నారో వారు పూర్తి అప్ర‌మ‌త్త‌త‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని స్ప‌స్టం చేశారు. ఏ మాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించినా భారీ మూల్యం రాబోయే రోజుల్లో చెల్లించాల్సిన ప‌రిస్తితి నెల‌కొనే ప్ర‌మాదం ఉంద‌న్నారు రేవంత్ రెడ్డి.

Leave A Reply

Your Email Id will not be published!