అల్లు అర‌వింద్ కామెంట్స్ య‌ష్ త‌ల్లి కౌంట‌ర్

సినీ వ‌ర్గాల‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీసింది

బెంగ‌ళూరు : ప్ర‌ముఖ నిర్మాత‌, పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అర‌వింద్ తాజాగా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆయ‌న టాప్ క‌న్న‌డ హీరోగా వెలుగొందుతున్న య‌ష్ గురించి నోరు పారేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల‌లో ప్ర‌త్యేకించి దక్షిణాదిలో కేజీఎఫ్ చిత్రానికంటే ముందు య‌ష్ అంటే ఎవ‌రికీ తెలియ‌ద‌ని ఎద్దేవా చేశారు ఓ సినీ కార్య‌క్ర‌మంలో. దీంతో ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. ప్ర‌ధానంగా క‌న్న‌డ సినీ ప్రేమికుల మ‌న‌సులు గాయ‌ప‌డేలా చేశాయి. అల్లు అరవింద్ చేసిన తాజా కామెంట్స్ పై సీరియ‌స్ అయ్యారు య‌ష్ త‌ల్లి పుష్ప‌. ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక స్థాయిలో ఉన్న అల్లు అర‌వింద్ ఇలాంటి చ‌వ‌క‌బారు కామెంట్స్ చేయ‌డం త‌గ‌ద‌న్నారు. ఆయ‌న‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ కూడా ఇచ్చారు.

కేజీఎఫ్‌కు ముందే నా కుమారుడు య‌ష్ కన్నడలో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడని పేర్కొంది. ఒక తల్లిగా అతని ప్రయాణం చూసి నేనెంతో గర్వపడుతున్నాన‌ని ఆమె ఘాటుగా స‌మాధానం ఇచ్చింది అల్లు అర‌వింద్ కు. ఇదిలా ఉండ‌గా య‌ష్ కీ రోల్ పోషించిన టాక్సిక్ మూవీ ఇటీవ‌లే ఆగ‌స్టు 26న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దీనికి గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. వ‌సూళ్ల ప‌రంగా ఆశించిన దానికంటే ఎక్కువ‌నే వ‌చ్చాయి. కానీ బిగ్ స‌క్సెస్ ను అందుకోలేక పోయింది ఈ మూవీ. దీంతో టాక్సిక్ మూవీని , అందులో న‌టించిన య‌ష్ ను త‌క్కువ చేసి మాట్లాడిన అల్లు అర‌వింద్ పై భ‌గ్గుమంటున్నారు క‌న్న‌డ‌వాసులు, య‌ష్ అభిమానులు.

Leave A Reply

Your Email Id will not be published!