ప్రిన్స్ ‘వార‌ణాసి’ మూవీ ప్ర‌చారంపై జ‌క్క‌న్న ఫోక‌స్

ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 5, 000 వేల కోట్ల వ‌సూలు

హైద‌రాబాద్ : పాన్ ఇండియా స్టార్ డైరెక్ట‌ర్ ఎస్ఎస్ రాజ‌మౌళి తీసిన వార‌ణాసిపై ఉత్కంఠ నెల‌కొంది. ఇటీవలే షూటింగ్ పూర్త‌యింది. ఇంకా ఎడిటింగ్, త‌దిత‌ర ప‌నులు మిగిలి ఉన్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం. ఈ చిత్రంలో ప్రిన్స్ మ‌హేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా కీల‌క పాత్ర‌లు పోషించారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘వారణాసి’ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఒక కీలకమైన అప్‌డేట్ వచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్, ఎస్.ఎస్. రాజమౌళి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులతో ముచ్చటించి, తన రాబోయే చిత్రం ‘డ్రాగన్’ గురించి మాట్లాడారు.

‘డ్రాగన్’ గురించి అప్‌డేట్ ఇచ్చే ముందు, ‘వారణాసి’ గురించి ఏదైనా చెప్పగలరా అని ఎన్టీఆర్ రాజమౌళిని అడిగారు. ఆ తర్వాత ఆయన నేరుగా వారణాసి ఏప్రిల్ 7న వస్తుందా? అని అడిగారు. దానికి రాజమౌళి ఖచ్చితంగా అని బదులిచ్చారు. రాజమౌళి సమాధానం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ‘వారణాసి’ 7న వస్తుందని ప్రేక్షకులకు చెప్పి, అభిమానులను సిద్ధంగా ఉండమని కోరారు. ఈ ప్రకటన ఈవెంట్‌లోని ప్రేక్షకులలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈ మూవీలో మ‌రో దిగ్గ‌జ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రాన్ని ఒక భారీ పాన్-వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందిస్తున్నాడు.

ఈ చిత్రం ఇప్పటికే సినీ ప్రేక్షకులలో గణనీయమైన ఆసక్తిని రేకెత్తించింది. ఈ కార్యక్రమంలో రాజమౌళి విడుదల తేదీని ధృవీకరించడంతో, వారణాసి ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనే దానిపై అభిమానులకు ఇప్పుడు మరింత స్పష్టత వచ్చింది.

Leave A Reply

Your Email Id will not be published!