యువ‌త సివిల్ స‌ర్వీస్ లోకి రావాలి : మోదీ

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ధాన‌మంత్రి

న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న యువ‌తను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉన్న యువతను సివిల్ సర్వీసెస్‌లోకి తీసుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అభ్యర్థులు ప్రజాసేవలో ఎందుకు చేరాలని అనుకుంటున్నారో నియామక ప్రక్రియలో అంచనా వేయాలని పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ నియామక ప్రక్రియలో అభ్యర్థుల జ్ఞానాన్ని మాత్రమే కాకుండా, పౌరులకు సేవ చేయాలనే వారి ప్రేరణను కూడా అంచనా వేయాలని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజా పదవుల పట్ల ఆసక్తి లేని యువతను దేశం ప్రజాసేవల్లోకి తీసుకు రావాలని ప్రధానమంత్రి గురువారం అన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియామక పరీక్ష కేవలం అభ్యర్థికి ఏమి తెలుసో మాత్రమే కాకుండా ఆ యువత సివిల్ సర్వీసెస్‌లోకి ఎందుకు రావాలను అనుకుంటున్నారో కూడా చూడటం చాలా అవసరమని అన్నారు.

మా మంత్రం పౌరుడే దేవుడు. అంటే దేశ పౌరుడు మాకు దైవంతో సమానం. మాకు పౌరునికి సేవ చేయడమే అత్యంత ముఖ్యమ‌ని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు. మనం ఎల్లప్పుడూ రెండు ప్రామాణిక సూత్రాలను గుర్తుంచు కోవాల‌న్నారు. ఒకటి దేశమే ప్రథమం. రెండవది పౌరుడే ప్రథమం అని మోదీ అన్నారు. ప్రభుత్వ పదవికి కాకుండా ప్రజా సేవకు ఆకర్షితులయ్యే యువతను మనం ప్రభుత్వ సేవల్లోకి తీసుకు రావాలి అన్నారు. అందువల్ల నియామక పరీక్ష‌ అభ్యర్థికి ఏమి తెలుసో మాత్రమే పరీక్షించ కూడదన్నారు ప్ర‌ధాన‌మంత్రి. ఆ యువకుడు సివిల్ సర్వీసెస్‌లోకి ఎందుకు రావాలనుకుంటున్నాడో కూడా చూడాలన్నారు . యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించారు. కీల‌క సూచ‌న‌లు చేశారు మోదీ.

Leave A Reply

Your Email Id will not be published!