ఫారం 7ను దుర్వినియోగం చేస్తున్న బీజేపీ

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన డీకే శివ‌కుమార్

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఓటర్లను తొలగించడానికి బీజేపీ ఫారం 7ను దుర్వినియోగం చేస్తోందని మండిప‌డ్డారు. తమ నియోజకవర్గాల్లో ఫారం 7 దరఖాస్తులు మోస పూరితంగా దాఖలు చేశారనే ఆరోపణలకు సంబంధించిన పత్రాలను పలువురు కాంగ్రెస్ నాయకులు అందించారని ఆయన అన్నారు. కొనసాగుతున్న స‌ర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించేందుకు ఫారం 7ను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై, క్రిమినల్ విచారణతో సహా సమగ్ర దర్యాప్తు జరపాలని డీకే శివకుమార్ పిలుపునిచ్చారు. ఒక వీడియో సందేశంలో పార్టీ నాయకుల ఆదేశాల మేరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు మైనారిటీలు, పేదలు, దళితుల పేర్లను తొలగించేందుకు దరఖాస్తులను సమర్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ నియోజకవర్గాల్లో ఫారం 7 దరఖాస్తులు మోసపూరితంగా దాఖలు చేశారనే ఆరోపణలకు సంబంధించిన పత్రాలను పలువురు కాంగ్రెస్ నాయకులు అందించారని ఆయన అన్నారు.

ఈ విషయంపై చట్ట పరిధిలో సమగ్ర దర్యాప్తు, క్రిమినల్ దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది అని శివకుమార్ అన్నారు. ఈ సమస్య కొన్ని నియోజకవర్గాలకే పరిమితం కాలేదని, మంత్రి ఈశ్వర్ ఖండ్రే భల్కి నియోజకవర్గం, నయన మోటమ్మ ముడిగెరె నియోజకవర్గం, తన్వీర్ సైట్ నరసింహరాజ నియోజకవర్గంతో సహా పలువురు సిట్టింగ్ , మాజీ శాసనసభ్యుల నియోజకవర్గాల్లో ఇలాంటి ప్రయత్నాలు జరిగినట్లు నివేదికలు వచ్చాయని సీఎం ఆరోపించారు. మన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనే ఇది జరుగుతోందంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద కుట్ర జరుగుతోందని అర్థం అని ఆయన ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల జాబితా నుంచి కోటికి పైగా పేర్లను తొలగించారని, 50 లక్షలకు పైగా ఓటర్లకు నోటీసులు జారీ చేశారని తెలిపారు. ప్రస్తుతం క్లెయిమ్‌లు , అభ్యంతరాల ప్రక్రియ కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!