క‌ర్ణాట‌క‌లో క‌రువు ప్ర‌భావం రూ. 60 వేల కోట్లు న‌ష్టం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఉప ముఖ్య‌మంత్రి

బెంగ‌ళూరు : ఎల్ నినో ప్ర‌భావం దేశాన్ని అత‌లాకుత‌లం చేస్తోంది. ఈ త‌రుణంలో దీని ఎఫెక్ట్ ఎక్కువ‌గా ద‌క్షిణాది రాష్ట్రాల‌ను త‌ల‌కిందులు చేస్తుండ‌డంతో ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను వెతికే ప‌నిలో ప‌డ్డాయి ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు. ఇందుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు క‌ర్ణాట‌క రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌రమేశ్వ‌ర‌. ఆయ‌న బెంగ‌ళూరులో మీడియాతో మాట్లాడారు. క‌రువు కారణంగా రాష్ట్రానికి రూ. 60,000 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంద‌ని అన్నారు. వీటిలో 177 తాలూకాలకు నష్ట అంచనా ప్రక్రియ పూర్తయిందని స్ప‌ష్టం చేశారు. కేంద్రానికి సమర్పించిన రెండవ విజ్ఞాపన పత్రంలో సుమారు రూ. 46,000 కోట్ల నష్టం ఉన్నట్లు నివేదించిన‌ట్లు తెలిపారు. ఆయ‌న రాష్ట్ర రెవిన్యూ శాఖ‌ను కూడా నిర్వ‌హిస్తున్నారు. : రాష్ట్రంలో కరువు సంబంధిత నష్టాలు రూ. 50,000 కోట్ల నుండి రూ. 60,000 కోట్ల వరకు ఉండవచ్చని అంచ‌నా వేశామ‌న్నారు. రాబోయే రోజుల్లో కరువు ప్ర‌భావం అంత‌కు మించి కూడా ఉండ‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు.

కరువు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి మూడు కేంద్ర బృందాలు రానున్న నేపథ్యంలో 217 తాలూకాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు తెలిపారు ప‌ర‌మేశ్వ‌ర‌. వీటిలో 177 తాలూకాలకు నష్ట అంచనా పూర్తయిందిని చెప్పారు. కేంద్రానికి సమర్పించిన రెండవ విజ్ఞాపన పత్రంలో సుమారు రూ. 46,000 కోట్ల నష్టం ఉన్నట్లు నివేదించిన‌ట్లు తెలిపారు. అక్టోబర్ 1న కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించిన మిగిలిన 40 తాలూకాలకు కూడా నష్ట అంచనా ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు డిప్యూటీ సీఎం. ఈ తాలూకాలన్నింటిలో జరిగిన నష్టాన్ని క్రోడీకరించిన తర్వాత మొత్తం అంచనా నష్టం రూ. 60 వేల కోట్ల‌కు పైగా ఉంటుంద‌న్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రానికి దక్కాల్సిన సహాయాన్ని కోరతామని ఆయన చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!