చెన్నై : తమిళనాడులో కొలువు తీరిన టీవీకే పార్టీ సర్కార్ ఎప్పటికప్పుడు సమయోచితంగా వ్యవహరిస్తోంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని నడుపుతుండగా ఇంకో వైపు కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీతో సఖ్యతతో వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. విచిత్రం ఏమిటంటే తమిళనాడులో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు , ఎంపీ రాహుల్ గాంధీ ఒకే రోజు పర్యటించారు. దీంతో ఈ ఇద్దరి అగ్ర నేతల టూర్ తో ఉక్కిరి బిక్కిరి అయ్యారు సీఎం. ఇదే సమయంలో తాజాగా టీవీకే అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలలో భారీ తేడాతో విజయం సాధించారు టీవీకే అభ్యర్థులు. దీంతో ఆ పార్టీకి సంఖ్యా బలంగా అదనపు బలం చేకూరింది. ధారాపురం , మదురాంతకం అసెంబ్లీ ఉప ఎన్నికలలో సెక్యులర్ సోషల్ జస్టిస్ విక్టరీ అలయన్స్ విజయం సాధించిన అనంతరం, చెన్నైలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఇదే సమయంలో రాష్ట్ర రాజధానికి వచ్చిన అగ్ర నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఆయనతో కలిసి భోజనం చేశారు. చాలా సేపు వివిధ అంశాలపై చర్చించారు.
రాహుల్ గాంధీ మధ్యాహ్నం 12.30 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి విజయ్ నీలన్‌కరై నివాసానికి వెళ్లారు. ఐలాండ్ గ్రౌండ్స్‌లో విద్యార్థుల గళం అనే కార్యక్రమంలో గాంధీ ప్రసంగించారు. ఈ కార్యక్రమం పరీక్షలు, విద్యా ఖర్చులు, నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఢిల్లీలో నిరసనలపై అణచివేత జరుగుతున్న తరుణంలో ఈ పర్యటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. గాంధీ నిర్ణయానికి అదనపు రాజకీయ కోణం చేకూరింది. కాంగ్రెస్ జాతీయ ప్రతిపక్ష వ్యూహంలో ఒకప్పుడు కీలక కేంద్రంగా ఉన్న తమిళనాడులో ఆయన పర్యటనలు చాలా అరుదుగా మారిన సుదీర్ఘ విరామం తర్వాత, ఇది ఆయన చేపట్టిన అత్యంత ముఖ్యమైన రాజకీయ కార్యక్రమం కావడం విశేషం.ది. మరో వైపు చెన్నై మెట్రో ఫేజ్ II మొదటి కార్యాచరణ దశ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి విజయ్ పాల్గొన్నారు. ఆయనతో కలిసి ప్రయాణం చేశారు. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిద్దరూ కలిసి బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి.
