తిరుమల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం (భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా అక్టోబరు 16న గరుడ వాహనం, 17న పుష్పక విమానం, అక్టోబరు 19న స్వర్ణ రథం, 20న చక్రస్నానం జరుగనున్నాయి. ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడ వాహనసేవ రాత్రి 6.30 నుండి 11.30 గంటల వరకు జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా ఉంది.
అక్టోబర్ 11న ఆదివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అంకురార్పణం చేపట్టారు. 12న బంగారు తిరుచ్చి ఉత్సవం ఉదయం 9 గంటలకు , పెద్ద శేష వాహనం రాత్రి 7 గంటలకు జరుగుతుంది. 13వ తేదీన చిన్నశేష వాహనం ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు హంస వాహనంపై ఊరేగుతారు స్వామి వారు. 14న సింహ వాహనం ఉదయం 8 గంటలకు, ముత్యపు పందిరి వాహనం రాత్రి 7 గంటలకు, 15న కల్పవృక్ష వాహనం ఉదయం 8 గంటలకు, సర్వ భూపాల వాహనం రాత్రి 7 గంటలకు, 16న మోహినీ అవతారం ఉదయం 8 గంటలకు, గరుడ వాహనం సాయంత్రం 6.30 గంటలకు, 17న
హనుమంత వాహనం ఉదయం 8 గంటలకు, పుష్పక విమానం సాయంత్రం 4 గంటలకు, గజ వాహనం రాత్రి 7 గంటలకు జరుగుతుంది. 18న సూర్యప్రభ వాహనం ఉదయం 8 గంటలకు, చంద్రప్రభ వాహనం రాత్రి 7 గంటలకు, అక్టోబరు 19న స్వర్ణరథం ఉదయం 7 గంటలకు, అశ్వ వాహనం రాత్రి 7 గంటలకు,
20న చక్రస్నానం ఉదయం 6 గంటలకు నిర్వహంచనున్నట్లు వెల్లడించింది టీటీడీ.
