కూట‌మి పాల‌న‌లో మున్సిపాలిటీల‌కు మ‌హ‌ర్ద‌శ‌

ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ కీల‌క వ్యాఖ్య‌లు

అమ‌రావ‌తి : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలతో మొదలుపెట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీల వరకు స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలైందని, ఈ నెల 25, 26 తేదీల నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుందని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్‌కుమార్ తెలిపారు. శుక్ర‌వారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర స్థాయి విధానాలను నిర్ణయిస్తే, స్థానిక సంస్థల ఎన్నికలు మనం నివసించే వీధి, రోడ్డు, వీధి దీపాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, స్థానిక జీవనోపాధిని నిర్ణయిస్తాయ‌ని పేర్కొన్నారు. మన ప్రాంతం ఎంత పరిశుభ్రంగా, బాగుండాలి, ఎంత హాయిగా జీవించాలన్నది మనం వేసే ఈ ఓటుపైనే ఆధారపడి ఉంద‌న్నారు. మన వీధిని, బడిని, ఊరిని, మున్సిపాలిటీని నిజాయితీగా అభివృద్ధి పథంలో ఎవరు నడిపించగలరో ఆలోచించి ఓటు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు విజ‌య్ కుమార్. మనకు మంచి చేసిన వారికి, మన ప్రాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే శక్తి ఉన్న కూటమికి మద్దతు ఇవ్వాల్సిన సమయం ఇది అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 30 నెలల కాలంలో రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థలు (17 నగరపాలక సంస్థలు, 106 పురపాలక సంఘాలు/నగర పంచాయతీలు) రూపురేఖలు మారాయని చ‌చెప్పారు చైర్మ‌న్. గతంలో అస్తవ్యస్తంగా ఉన్న సమస్యలను క్రమబద్ధీకరించి, అత్యంత పారదర్శకమైన పాలనను అందించాం అన్నారు. పట్టణాలు అనగానే మొదట గుర్తుకొచ్చేది రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, పచ్చదనం, మౌలిక సదుపాయాలు. వీటన్నింటినీ సమూలంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ఇటీవల దాదాపు రూ. 11,359 కోట్ల భారీ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ప్రాజెక్టులను నిర్విఘ్నంగా ప్రారంభించింద‌ని చెప్పారు. పరిశ్రమల రాకతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని అన్నారు. ఎటువంటి సంకోచం లేకుండా తాము చేసిన పనులను ఒకటి కాదు, రెండు కాదు.. వందల కొద్దీ నిరూపించి చూపించగలం అన్నారు. ఆ ధైర్యంతోనే, మా అభివృద్ధిని చూసి ఓటు వేయమని ప్రజల ముందుకు వస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. నామినేషన్ల పర్వం ప్రారంభమవుతున్న వేళ, ప్రతి ఒక్కరూ ఆలోచించి రాష్ట్ర, స్థానిక పురోగతికి అండగా నిలవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!