సింగరేణిని ప్రైవేటీకరణ నుండి కాపాడుకుంటాం

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు

హైద‌రాబాద్ : బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో పూర్తిగా వైఫ‌ల్యం చెందింద‌ని ఆరోపించారు. పాల‌నా ప‌రంగా సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్ల ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హం తో ఉన్నార‌ని పేర్కొన్నారు. ఆరు నూరైనా స‌రే స‌ర్కార్ చేస్తున్న కుట్ర‌ల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేస్తామ‌న్నారు. సింగరేణి కాలరీస్ సంస్థను, కార్మికుల హక్కులను కాపాడేందుకు బిఆర్‌ఎస్ కట్టుబడి ఉందని స్ప‌ష్టం చేశారు కేటీఆర్. సింగరేణిని ప్రైవేటీకరణ , అవినీతి నుండి రక్షించే బాధ్యతను బిఆర్‌ఎస్ తీసుకుంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు స్పష్టం చేశారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నాయకులు, తెలంగాణ కోల్ మైన్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, బొగ్గు ఉత్పత్తిలో తగ్గుదల, టెండర్లలో అవకతవకల ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. సింగరేణిని, కార్మికులను కాపాడు కోవడానికి సమష్టి పోరాటం అవసరమని ఆయన పేర్కొన్నారు. సింగరేణి విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం , కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాల వైఖరిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని రామారావు అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి, లాభాల్లో వాటా పంపిణీ, వారసత్వ ఉద్యోగాల కల్పన, వైద్య సదుపాయాలు, కార్మికుల కుటుంబాల సంక్షేమం వంటి అంశాలను సింగరేణి కార్మికులకు వివరించాలని ఆయన నాయకులకు సూచించారు. రాబోయే సింగరేణి కార్మిక సంఘం (ట్రేడ్ యూనియన్) ఎన్నికల కోసం పార్టీని, అలాగే టిబిజికెఎస్ నాయకులను , కార్యకర్తలను సిద్ధం చేయడంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.

Leave A Reply

Your Email Id will not be published!