డొనాల్డ్ ట్రంప్ కు న‌రేంద్ర మోదీ స‌రెండ‌ర్

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సుబ్ర‌మ‌ణ్య స్వామి

చెన్నై : భార‌తీయ జ‌న‌తా పార్టీ అగ్ర నేత సుబ్ర‌మ‌ణ్య స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని టార్గెట్ చేశారు. గ‌తంలో ప‌లుమార్లు బీజేపీ అగ్ర నేత‌ల‌పై నిప్పులు చెరిగారు. అయినా ఇప్ప‌టి వ‌ర‌కు సుబ్ర‌మ‌ణ్య స్వామిపై చ‌ర్య‌లు తీసుకోక పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. సుబ్ర‌మ‌ణ్య స్వామి పేరు చెబితే చాలా మంది నేత‌ల‌కు వ‌ణుకు పుడుతుంది. ప్ర‌త్యేకించి బీజేపీలో, దాని అనుబంధ సంస్థ‌లైన ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ, భ‌జ‌రంగ్ ద‌ళ్ సంస్థ‌ల‌లో. అంతే కాకుండా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు సైతం జంకు త‌నంటే. ఆయ‌న నిక్క‌చ్చిగా మాట్లాడతారు. త‌న వ‌ద్ద ఆధారాలు లేకుండా ఎక్కువ‌గా విమ‌ర్శ‌లు చేయ‌రు. తాజాగా ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ క‌ర‌ణ్ థాప‌ర్ తో జ‌రిగిన సంభాష‌ణ‌లో షాకింగ్ కామెంట్స్ చేశారు ప్ర‌ధాన‌మంత్రి గురించి. ఆయ‌న వ్య‌క్తిగ‌త బల‌హీన‌త‌ల గురించి కూడా.

మోదీకి సంబంధించిన ఫోటోలు ట్రంప్ దగ్గర ఉన్నాయా? అన్న ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు సుబ్ర‌మ‌ణ్య స్వామి. అమెరికా దేశాధ్య‌క్షడి వ‌ద్ద చాలానే ఉన్నాయని బాంబు పేల్చారు. వీరిద్దరూ కలిసి ఎన్నో పనులు చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది ఎప్స్టీన్ ఐలాండ్‌కు సంబంధించిన విషయమా? అన్న మ‌రో ప్ర‌శ్న‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు సుబ్ర‌మ‌ణ్య స్వామి. అది చాలా చిన్న విషయం. ఇంకా చాలా ఉన్నాయని అన్నారు. న‌రేంద్ర మోదీ విదేశీ పర్యటనల్లో ఏం చేశారో విదేశీ గూఢచారి సంస్థలకు తెలుసని, అందుకే అమెరికా ఆయనను తమ గుప్పిట్లో ఉంచుకుందని అన్నారు.
అందుకే ట్రంప్‌కు ఏదైనా అవసరమైనప్పుడు ఇది చేయి, లేదంటే నీ బండారం బయట పెడతాను అని అంటుంటారు.

మన ప్రభుత్వం ప్రకటించక ముందే, ‘ఆపరేషన్ సింధూర్’లో భాగంగా జరుగుతున్న ఫిరంగి దాడులను ఆపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించేశారు. ట్రంప్ సుంకాలు (టారిఫ్‌లు) విధించినప్పుడు మనం ఏమీ చేయలేక మౌనంగా ఉండి పోయామ‌ని గుర్తు చేశారు సుబ్ర‌మ‌ణ్య స్వామి. ఇక విదేశాంగ మంత్రి జైశంకర్ ను కూడా ఏకి పారేశారు. ఆయ‌న అమెరికా వెళ్లి వారి పాదాలను తాకుతున్నారని ఫైర్ అయ్యారు.

Leave A Reply

Your Email Id will not be published!