వేగంగా ‘జ‌న‌వ‌రి 12 విడుద‌ల’ షూటింగ్

సినిమా నుంచి కీల‌క అప్ డేట్ రాక

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన ద‌ర్శ‌కుడిగా పేరు పొందారు అనిల్ రావిపూడి. ఆయ‌న ఏ సినిమా చేసినా ఆ మూవీ ప‌క్కా స‌క్సెస్ . ఎప్ప‌టి లాగే సంక్రాంతి సెంటిమెంట్ తో మ‌రో కొత్త చిత్రంతో ముందుకు రాబోతున్నాడు. తాజాగా విక్ట‌రీ వెంక‌టేశ్ , నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ , కీర్తి సురేష్ తో క‌లిసి జ‌న‌వ‌రి 12 విడుద‌ల కు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఈ సినిమాను రాబోయే సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుండటంతో షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఊటీలో 12 రోజుల పాటు జరిగిన షెడ్యూల్‌లో రెండు పాటలతో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజా సమాచారం ప్రకారం నవంబర్ మొదటి వారంలో చిత్ర బృందం కజకిస్థాన్‌కు బయలు దేరనుంది. వెంకటేష్ నటించిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం రేపు విడుదల కానుండటంతో, ఆ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు పూర్తయ్యాక ఆయన ఈ బృందంతో కలుస్తారు.

ఈ షెడ్యూల్‌లో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో నవంబర్ నెలాఖరు లోపు షూటింగ్‌ను పూర్తి చేసి, పోస్ట్-ప్రొడక్షన్ పనులకు ,ప్రమోషన్లకు తగిన సమయం ఉండేలా చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2026 ద్వితీయార్థంలో ప్రారంభమైన ఈ చిత్రం అనిల్ రావిపూడి పర్యవేక్షణలో చాలా వేగంగా, సరైన దిశలో సాగుతోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో వెంకటేష్ , కళ్యాణ్ రామ్ బావమరిది-బావ పాత్రల్లో కనిపించనున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ రావిపూడి తన చిత్రాల ప్రమోషన్లను చాలా ఆసక్తికరంగా నిర్వహించడంలో పేరుగాంచారు. ఈ సినిమా విషయంలో కూడా ఆయన సోషల్ మీడియాలో మంచి సందడి సృష్టిస్తున్నారు. టైటిల్ ప్రకటన కావచ్చు, సంగీత దర్శకుడి పరిచయ వీడియో కావచ్చు లేదా షూటింగ్ అప్‌డేట్లు కావచ్చు ఇవన్నీ లక్షలాది వ్యూస్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా, ఇన్‌స్టాగ్రామ్ , ట్విట్టర్ వేదికలపై ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Leave A Reply

Your Email Id will not be published!